Andhra News: వైకాపా నాయకులు... నా పొలాన్ని కబ్జా చేశారయ్యా!

వైకాపా నాయకులు తన పొలాన్ని కబ్జాచేసి మట్టిని తవ్వుతున్నారంటూ గిరిజన రైతు రామావత్‌ ఓబులానాయక్‌ సెల్ఫీవీడియో విడుదల చేయడం కలకలం రేపింది. 

Updated : 25 Nov 2022 08:55 IST

న్యాయం చేయాలంటూ సీఎంకు గిరిజన రైతు వేడుకోలు

ఈనాడు, అమరావతి: వైకాపా నాయకులు తన పొలాన్ని కబ్జాచేసి మట్టిని తవ్వుతున్నారంటూ గిరిజన రైతు రామావత్‌ ఓబులానాయక్‌ సెల్ఫీవీడియో విడుదల చేయడం కలకలం రేపింది.  గుంటూరు పశ్చిమమండలం వెంగళాయపాలెంలోని తన పొలాన్ని కబ్జాచేసిన వైకాపా నాయకులు రాత్రిళ్లు మట్టిని తవ్వి తరలిస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తే చంపేసి పొలంలోనే పాతిపెడతామని బెదిరించారని బాధితుడు వీడియోలో కన్నీరు పెట్టుకున్నారు. దిక్కున్నచోట చెప్పుకో... తాము మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత మనుషులమని, మట్టి లారీలకు అడ్డుపడితే తొక్కించేస్తామని బెదిరించారంటూ వాపోయారు. ఐదురోజుల కిందట సుమన్‌, అశోక్‌, భాను అనే వ్యక్తులు పొక్లెయిన్‌, లారీలతో వచ్చారు. తహశీల్దారు, మేకతోటి సుచరిత అనుమతి ఇచ్చారంటూ... మట్టి తవ్వుతున్నారు. వీఆర్వో సాగర్‌బాబు, గ్రామనౌకరు భాస్కరరావు వారికి సహకరిస్తున్నారు’ అని లేఖలో ఓబులానాయక్‌ వాపోయారు.తనకు సీఎం న్యాయం చేయకపోతే కుటుంబం సహా ఆత్మహత్య చేసుకుంటామన్నారు. ఈమేరకు సీఎం జగన్‌కు ఓబులానాయక్‌ గురువారం లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని