కనులపండువగా అక్షరాభ్యాసాలు

విజయనగరం రింగ్‌ రోడ్డులోని జ్ఞాన సరస్వతీదేవి ఆలయం చిన్నారులు, వారి తల్లిదండ్రులతో కళకళలాడింది.

Published : 27 Jan 2023 04:16 IST

విజయనగరం కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: విజయనగరం రింగ్‌ రోడ్డులోని జ్ఞాన సరస్వతీదేవి ఆలయం చిన్నారులు, వారి తల్లిదండ్రులతో కళకళలాడింది. గురువారం వసంత పంచమి సందర్భంగా సుమారు 4వేల మంది చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసాలు చేయించారు. విద్యాబుద్ధులు ప్రసాదించాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం వరకూ వేడుకగా అక్షరాభ్యాస క్రతువు సాగింది. అనంతరం అమ్మవారికి తులాభార సేవ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచీ భక్తులు తరలివచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు