Gas Cylinder: సిలిండర్‌ తెచ్చినందుకు అదనపు రుసుము చెల్లించొద్దు

ఎల్‌పీజీ సిలిండర్‌ ఇంటికి తెచ్చినప్పుడు.. రసీదుపై ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని, అదనంగా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 31 Jan 2023 06:48 IST

ఈనాడు, అమరావతి: ఎల్‌పీజీ సిలిండర్‌ ఇంటికి తెచ్చినప్పుడు.. రసీదుపై ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని, అదనంగా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్ణీత పరిధిలో ఉన్నా కూడా కొందరు డీలర్లు, డెలివరీ చేసేవారు అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారని తరచూ ఫిర్యాదులు అందుతున్నాయని, వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వసూలు చేస్తున్నట్లయితే జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు, ఇంధన సంస్థల మార్కెటింగ్‌ సిబ్బందికి ఫిర్యాదు చేయాలన్నారు. పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలోని కాల్‌ సెంటర్‌ 1967, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలోని టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 2333555 కి ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని