విభజన హామీలు నెరవేర్చాలి

రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌ వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరినట్లు వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు.

Published : 31 Jan 2023 03:13 IST

వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి

ఈనాడు, దిల్లీ: రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌ వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరినట్లు వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం అందులో లేవనెత్తిన అంశాలపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరానికి రాష్ట్రం వ్యయం చేసిన మొత్తాన్ని ఎప్పటికప్పుడు విడుదల చేయాలని, ఏపీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న 12 వైద్య కళాశాలలకు కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. పోలవరానికి సవరించిన అంచనాల ప్రకారం రూ.55,549 కోట్లు, తాగు నీటి కాంపోనెంట్‌ కింద రూ.4,068 కోట్లు ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు, అన్ని పంటలకు కనీస మద్దతు ధర, ఆక్వాకల్చర్‌కు ప్రోత్సాహం, బీసీ కుల గణన, సైబర్‌ సెక్యూరిటీ అంశాలను లేవనెత్తినట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని