Vijaya Dairy: ఏపీలో విజయ పాల ధర పెంపు

రైతుల పాల సేకరణ ధరలు, నిర్వహణ, రవాణా ఖర్చులు పెరిగిన దృష్ట్యా మార్చి 1 నుంచి విజయ పాల ధర అర లీటరు ప్యాకెట్‌పై రూ. 1 చొప్పున పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్‌ యూనియన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కొల్లి ఈశ్వరబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 28 Feb 2023 08:03 IST

లీటరుకు రూ. 2 భారం

విద్యాధరపురం (విజయవాడ), న్యూస్‌టుడే: రైతుల పాల సేకరణ ధరలు, నిర్వహణ, రవాణా ఖర్చులు పెరిగిన దృష్ట్యా మార్చి 1 నుంచి విజయ పాల ధర అర లీటరు ప్యాకెట్‌పై రూ. 1 చొప్పున పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్‌ యూనియన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కొల్లి ఈశ్వరబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు రకాల ప్యాకెట్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందన్నారు. అర లీటరు విజయ లోఫ్యాట్‌ (డీటీఎం) ధర రూ. 27, ఎకానమీ (టీఎం) రూ. 29, ప్రీమియం (స్టాండర్డ్‌) రూ. 31, స్పెషల్‌ (ఫుల్‌ క్రీమ్‌) రూ. 36, గోల్డ్‌ రూ. 37, టీ-మేట్‌ రూ. 34 అయినట్లు వెల్లడించారు. పెరుగు, చిన్న పాల ప్యాకెట్లు, ఇతర పాల పదార్థాల విక్రయ ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపారు. నెలవారీ పాల కార్డుదారులకు మార్చి 9 వరకు పాత ధరలే వర్తిస్తాయని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని