Bharat Gaurav: తెలుగు రాష్ట్రాల నుంచి తొలి భారత్‌ గౌరవ్‌ రైలు

దేశంలోని విశిష్ఠ ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు సికింద్రాబాద్‌ నుంచి తొలిసారిగా బయలుదేరిన ‘భారత్‌ గౌరవ్‌’ రైలును దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ జెండా ఊపి ప్రారంభించారు.

Updated : 19 Mar 2023 06:58 IST

సికింద్రాబాద్‌లో ప్రారంభించిన జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌

రెజిమెంటల్‌ బజార్‌, న్యూస్‌టుడే: దేశంలోని విశిష్ఠ ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు సికింద్రాబాద్‌ నుంచి తొలిసారిగా బయలుదేరిన ‘భారత్‌ గౌరవ్‌’ రైలును దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో ప్రయాణించే వారికి కూచిపూడి నృత్యకళాకారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఐఆర్‌సీటీసీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రజనీ హసిజా, ఇతర సీనియర్‌ రైల్వే అధికారులతో కలిసి జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ యాత్రికులకు స్వాగత కిట్‌లు అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ జాన్‌ప్రసాద్‌, సికింద్రాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ అభయ్‌కుమార్‌ గుప్తా, జీజీఎంఐఆర్‌ సీటీసీ పి.రాజ్‌కుమార్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పర్యటన ఇలా..: ఈనెల 18వ తేదీ నుంచి 26 వరకు 8 రాత్రులు, 9 పగళ్లు ఈ యాత్ర కొనసాగుతుంది. పూరీ, కోణార్క్‌, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌వంటి పుణ్యక్షేత్రాలను చుట్టిరానుంది. సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరిన ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపికచేసిన ముఖ్య స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులకు ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందజేసేందుకు కేటరింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని