శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

తిరుమల శ్రీవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ శనివారం వీఐపీ బ్రేక్‌ సమయంలో దర్శించుకున్నారు.

Published : 26 Mar 2023 03:44 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ శనివారం వీఐపీ బ్రేక్‌ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు. ఆయనతో పాటు తిరుపతి మూడో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి వై.వీర్రాజు తదితరులు ఉన్నారు. శ్రీకాళహస్తిలోని ముక్కంటిని జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ దర్శించుకున్నారు.


రేపు ఏప్రిల్‌ నెల ఎస్‌ఈడీ టికెట్ల కోటా విడుదల

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్‌ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం (ఎస్‌ఈడీ) టికెట్లను సోమవారం ఉదయం 11 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు