‘ఫ్యామిలీ డాక్టర్’కు రాష్ట్ర వ్యాప్తంగా 260 కొత్త వాహనాలు
ఫ్యామిలీ డాక్టర్ విధానం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 260 నూతన 104 వైద్య వాహనాలు ప్రారంభించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.
చిలకలూరిపేటలో ప్రారంభించిన మంత్రి విడదల రజిని
చిలకలూరిపేట పట్టణం, గ్రామీణ, న్యూస్‌టుడే: ఫ్యామిలీ డాక్టర్ విధానం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 260 నూతన 104 వైద్య వాహనాలు ప్రారంభించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏరియా వైద్యశాలలో ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా సోమవారం కలెక్టర్ ఎల్.శివశంకర్‌తో కలిసి 104 వాహనాలను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రంలో 104 వైద్య వాహనాలు 676 పని చేస్తున్నాయని, వాటికి అదనంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం కోసం కొత్తగా మరో 260 ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రయోగాత్మకంగా నడుస్తోందని, ఏప్రిల్ మొదటి వారంలో సీఎం అధికారికంగా మొదలు పెడతారన్నారు. ఇందులో 14 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, 67 రకాల మందులు ఇస్తారని.. రానున్న కాలంలో 105 రకాల మందులిచ్చే ఆలోచన చేస్తున్నామని వివరించారు. ఎమ్మెల్యేలను కొనడం, వెన్నుపోటు పొడవడం తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అలవాటేనని మంత్రి రజిని విమర్శించారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Rana Naidu: ఎట్టకేలకు ‘రానానాయుడు’ సిరీస్‌పై స్పందించిన వెంకటేశ్
-
Ap-top-news News
రూ.99కే కొత్త సినిమా.. విడుదలైన రోజే ఇంట్లో చూసే అవకాశం
-
Ap-top-news News
జులై 20న విజయనగరంలో ‘అగ్నివీర్’ ర్యాలీ
-
India News
మృతదేహంపై కూర్చుని అఘోరా పూజలు
-
India News
దిల్లీలో బయటపడ్డ 2,500 ఏళ్లనాటి అవశేషాలు
-
Ts-top-news News
ధరణిలో ఊరినే మాయం చేశారు