ప్రతి ఒక్కరికి పింఛను అందించాల్సిందే
రాష్ట్రంలో వైఎస్‌ఆర్ పింఛను కానుక లబ్ధిదారులందరికీ పింఛను సొమ్ము అంది తీరాల్సిందేనని వాలంటీర్లను ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఆదేశించారు.
ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు
దేవరాపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైఎస్‌ఆర్ పింఛను కానుక లబ్ధిదారులందరికీ పింఛను సొమ్ము అంది తీరాల్సిందేనని వాలంటీర్లను ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఆదేశించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువలోని ఆయన క్యాంపు కార్యాలయం బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘పింఛను పంపిణీ జూన్ 1 (గురువారం) నుంచి ప్రారంభమవుతుంది. అయిదు రోజుల్లో లబ్ధిదారులందరికీ పింఛన్లు అందే విధంగా యంత్రాంగాన్ని సిద్ధం చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 63.14 లక్షల మందికి రూ.1739.75 కోట్లు అందజేస్తాం. పింఛను అందించడానికి లబ్ధిదారుల ఆధార్ నిర్ధారిత బయోమెట్రిక్, ఐరిస్, ముఖ ప్రామాణిక విధానాలతో పాటు ఆర్‌బీఐఎస్ విధానాన్ని ఉపయోగిస్తున్నాం. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పింఛను అందలేదని ఫిర్యాదు రాకుండా ప్రతి ఒక్కరికీ పింఛను అందాలి’ అని లేఖలో ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/10/2023)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్