పసుపు కొనుగోలుకు ప్రభుత్వ ఆదేశాలు
పంట చేతికొచ్చి మూడు నెలలు గడిచాక (పంటకాలం మారి మళ్లీ ఖరీఫ్ వచ్చాక), అధిక శాతం రైతులు తక్కువ ధరకే అమ్ముకున్నాక.. ప్రభుత్వానికి పసుపు రైతులు గుర్తొచ్చారు.
జూన్ 12 వరకే గడువు.. 20 వేల టన్నులే సేకరణ
ఈనాడు, అమరావతి: పంట చేతికొచ్చి మూడు నెలలు గడిచాక (పంటకాలం మారి మళ్లీ ఖరీఫ్ వచ్చాక), అధిక శాతం రైతులు తక్కువ ధరకే అమ్ముకున్నాక.. ప్రభుత్వానికి పసుపు రైతులు గుర్తొచ్చారు. ‘పసుపు రైతుల గోడు పట్టదా?’ శీర్షికతో గురువారం ‘ఈనాడు’లో కథనం రావడంతో.. 20 వేల టన్నుల సేకరణకు గురువారం హడావిడిగా ఆదేశాలిచ్చింది. క్వింటాలు రూ.6,850 (2019-20లో నిర్ణయించిన ధర) చొప్పున మద్దతు ధరపై పసుపు కొనేందుకు మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. సేకరణ వ్యవధిని జూన్ 1 నుంచి 12వ తేదీ వరకు నిర్ణయించింది. మార్కెటింగ్ శాఖ 1న ఆదేశాలివ్వగా, అవి మార్క్‌ఫెడ్, జిల్లా కార్యాలయాలకు 2న చేరాయి. మిగిలింది పది రోజులే. రైతులు ఆర్‌బీకేల్లో పేర్లు నమోదు చేసుకోవడం, అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం, గోతాలు, ఇతరత్రా సమకూర్చడం అంతా ఈ వ్యవధిలోనే అయిపోవాలి. సాధారణ రైతు ఇంతతక్కువ సమయంలో సరకు అమ్ముకోగలడా అన్నది ప్రశ్న.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jaishankar-Blinken: బ్లింకెన్-జైశంకర్ భేటీకి ముందు.. అమెరికా మళ్లీ అదే స్వరం..!
-
Laddu Auction: బండ్లగూడ లడ్డూ @ రూ.1.26 కోట్లు
-
Virat In ODI WC 2023: ‘మీరేమన్నారో విరాట్‌కు తెలిస్తే.. మీ పని అంతే’.. కివీస్ మాజీకి శ్రీశాంత్ కౌంటర్
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేశాయ్.. ప్రత్యేక ఆఫర్లతో పండగ సేల్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు