వెయ్యి అద్దె విద్యుత్‌ బస్సులకు ప్రతిపాదన

అద్దె ప్రాతిపదికన వెయ్యి విద్యుత్‌ బస్సుల కోసం కేంద్రానికి తాజాగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌.. దేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్టీసీలకు అవసరమైన విద్యుత్‌ అద్దె బస్సుల కోసం జాతీయస్థాయిలో టెండర్లు పిలిచి ధరలు ఖరారు చేస్తోంది.

Updated : 07 Jun 2023 04:40 IST

టెండర్లు పిలవనున్న కేంద్రం
వీటిలో సగం విశాఖ, విజయవాడలోని సిటీ బస్సులు

ఈనాడు-అమరావతి: అద్దె ప్రాతిపదికన వెయ్యి విద్యుత్‌ బస్సుల కోసం కేంద్రానికి తాజాగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌.. దేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్టీసీలకు అవసరమైన విద్యుత్‌ అద్దె బస్సుల కోసం జాతీయస్థాయిలో టెండర్లు పిలిచి ధరలు ఖరారు చేస్తోంది. ఇలా వేలాది బస్సులకు టెండర్లు పిలిచినప్పుడు వివిధ కంపెనీలు పోటీపడి తక్కువ ధర కోట్‌ చేస్తున్నాయి. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీ వెయ్యి విద్యుత్‌ బస్సుల కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు అధికారులు తెలిపారు. వీటిలో కొన్ని ఏసీ, మరికొన్ని నాన్‌ ఏసీ బస్సులున్నాయి. ఇందులో 500 వరకు విజయవాడ, విశాఖపట్నం సిటీ సర్వీసుల కింద లోఫ్లోర్‌ బస్సులు తీసుకోనున్నారు. మిగిలినవి సెమీఅర్బన్‌ కింద వివిధ నగరాలు, జిల్లాకేంద్రాల నుంచి సమీప గ్రామీణ ప్రాంతాలకు నడపాలని భావిస్తున్నారు.

తక్కువ ధరకు బిడ్లు

కొంతకాలం కిందట ఇదేవిధంగా వివిధ రాష్ట్రాల ఆర్టీసీలకు అవసరమైన ఆరు వేల బస్సుల కోసం కేంద్రం టెండర్లు పిలిస్తే.. వివిధ కంపెనీలు తక్కువ ధరకు కోట్‌ చేశాయి. గతంలో ఏపీఎస్‌ఆర్టీసీ తిరుపతి-తిరుమల ఘాట్‌లో నడిపేందుకు 50 బస్సులు, తిరుపతినుంచి సమీప జిల్లాకేంద్రాలకు నడిపేందుకు మరో 50 బస్సులకు బిడ్లు పిలిచింది. ఇందులో ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ.. తిరుమల ఘాట్‌లో నడిపే బస్సులకు కి.మీ.కు రూ.52.52, తిరుపతి అర్బన్‌ నుంచి నడిపే బస్సులకు కి.మీ.కు రూ.44.95 చొప్పున కోట్‌ చేసింది. ఇప్పుడు కేంద్రం పిలిచే టెండర్లలో వీటికంటే తక్కువ ధరకు అద్దె విద్యుత్‌ బస్సులు వస్తాయని అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని