Amaravati: మంత్రి నాగార్జున కసురుకొని.. బయటకు నెట్టేయించారు: కుటుంబం ఆవేదన
కారుణ్య నియామకం కోసం 20 ఏళ్లుగా జిల్లాలో అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని, రాష్ట్ర సచివాలయానికి వచ్చిన సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జునను కలిసి గోడు వినిపిస్తే.. బయటకు పొమ్మంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని, గన్‌మెన్‌తో బయటకు నెట్టేయించారని ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.
ఈనాడు, అమరావతి: కారుణ్య నియామకం కోసం 20 ఏళ్లుగా జిల్లాలో అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని, రాష్ట్ర సచివాలయానికి వచ్చిన సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జునను కలిసి గోడు వినిపిస్తే.. బయటకు పొమ్మంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని, గన్‌మెన్‌తో బయటకు నెట్టేయించారని ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన ఆర్పీ రేణుక, ఆమె తల్లి, సోదరుడు బుధవారం సచివాలయానికి వచ్చి మంత్రిని కలిస్తే పైవిధంగా ఛీత్కారం ఎదురైందని ఆ కుటుంబసభ్యులు మీడియాకు తెలిపారు. 2004లో తన సోదరి సాంఘిక సంక్షేమశాఖలో పనిచేస్తూ విధుల్లోనే మృతి చెందారని, కారుణ్య నియామకం కింద దరఖాస్తు చేస్తే, అక్కడి డీడీ అందుకు అధికారిక లేఖ ఇచ్చారని తెలిపారు. అయితే ఇప్పటివరకు తనుకు గానీ, తన సోదరుడికి గానీ కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని మంత్రికి మొరపెట్టుకోవడానికి వచ్చామని రేణుక కన్నీటి పర్యంతమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
KL Rahul: కెప్టెన్సీ అంటే ఇష్టం.. ఇది నాకేం కొత్త కాదు: కేఎల్ రాహుల్
-
IRCTC tour package: ఒక్క రోజులోనే ఆంధ్రా ఊటీ అందాలు చూసొస్తారా?.. IRCTC టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే..!
-
Koppula Harishwar Reddy: ప్రభుత్వ అధికార లాంఛనాలతో హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలు
-
Chandrababu Arrest : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు విచారణ ప్రారంభం
-
Kakinada: పామాయిల్ తోటలో విద్యుత్ తీగలు తగిలి.. ముగ్గురి మృతి
-
Justin Trudeau: ‘మేం ముందే ఈ విషయాన్ని భారత్‌కు చెప్పాం’: ఆగని ట్రూడో వ్యాఖ్యలు