Engineering Counselling: ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ 24 నుంచి..

ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈనెల 24 నుంచి ప్రారంభిస్తున్నట్లు కన్వీనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈనెల 24 నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు రిజిస్ట్రేషన్లు, 25 నుంచి ఆగస్టు 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Updated : 19 Jul 2023 07:32 IST

ఈనాడు, అమరావతి : ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈనెల 24 నుంచి ప్రారంభిస్తున్నట్లు కన్వీనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈనెల 24 నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు రిజిస్ట్రేషన్లు, 25 నుంచి ఆగస్టు 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కోర్సులు, కళాశాలల ఎంపిక ఐచ్ఛికాల నమోదుకు ఆగస్టు 3 నుంచి 8వరకు అవకాశం కల్పించామని, ఐచ్ఛికాల మార్పు ఆగస్టు 9న చేసుకోవచ్చని సూచించారు. 12న సీట్లను ఖరారు చేస్తామని, సీట్లు పొందిన వారు 13-14 తేదీల్లో చేరాలని పేర్కొన్నారు. 16నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని వివరించారు. 

ఫీజులు ఇలా.. : ఇంజినీరింగ్‌ కళాశాలలకు గరిష్ఠంగా రూ.లక్ష, కనిష్ఠంగా రూ.42వేలు ఫీజు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ఏడాది నుంచి మూడేళ్లపాటు ఈ ఫీజులు అమలులో ఉంటాయి. గత మూడేళ్లకు గరిష్ఠంగా రూ.70వేలు, కనిష్ఠంగా రూ.35వేలు ఫీజు నిర్ణయించగా.. ధరల పెరుగుదల, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఫీజులను నిర్ణయించినట్లు తెలిసింది. రూ.లక్ష ఫీజు ఉన్న కళాశాలలు పదిలోపే ఉండగా.. అత్యధిక కళాశాలలకు ఫీజు రూ.42వేలు ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని