Roja: రజినీకాంత్‌ డైలాగ్‌లు మమ్మల్ని ఉద్దేశించినవి కావు: మంత్రి రోజా

ప్రముఖ సినీనటుడు రజినీకాంత్‌ ఇటీవల జైలర్‌ సినిమా విడుదల వేడుకలో చెప్పిన డైలాగ్‌లు తమను ఉద్దేశించి చేసినవి కావని మంత్రి రోజా అన్నారు.

Updated : 05 Sep 2023 08:25 IST

తిరుమల, న్యూస్‌టుడే: ప్రముఖ సినీనటుడు రజినీకాంత్‌ ఇటీవల జైలర్‌ సినిమా విడుదల వేడుకలో చెప్పిన డైలాగ్‌లు తమను ఉద్దేశించి చేసినవి కావని మంత్రి రోజా అన్నారు. సోమవారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రజినీకాంత్‌ ఎవరినో ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను జనసేన కార్యకర్తలు తమకు అన్వయిస్తూ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్‌ చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకకు వచ్చిన రజినీకాంత్‌ను తాను విమర్శించలేదని, అయితే ఆయన ఎన్టీఆర్‌ గురించి మాట్లాడి ఉంటే బాగుంటుందని చెప్పానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు