Vyuham-RGV: ‘వ్యూహం’ ట్రైలర్‌పై ఫిర్యాదు

దర్శకుడు రాంగోపాల్‌వర్మ తీసిన వ్యూహం సినిమా ట్రైలర్‌ తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లను కించపరిచేలా ఉందని తెదేపా రీసెర్చ్‌, కమ్యునికేషన్స్‌ కమిటీ సభ్యుడు టి.గంగాధర్‌ ఆరోపించారు.

Updated : 09 Nov 2023 08:56 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: దర్శకుడు రాంగోపాల్‌వర్మ తీసిన వ్యూహం సినిమా ట్రైలర్‌ తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లను కించపరిచేలా ఉందని తెదేపా రీసెర్చ్‌, కమ్యునికేషన్స్‌ కమిటీ సభ్యుడు టి.గంగాధర్‌ ఆరోపించారు. రెండు పార్టీల కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసేలా పలు అభ్యంతర వ్యాఖ్యలు, పాటల్లోని కొన్ని పదాలు ఉన్నాయని తెలిపారు. రాంగోపాల్‌వర్మ సహా చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌, నటీనటులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. మంగళగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని