ఏపీ నుంచి సికింద్రాబాద్‌కు తరలిపోతున్న రైల్వేశాఖ కార్యాలయాలు

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు కొలిక్కి రాకపోవడంతో ఏపీలోని రైల్వేశాఖకు చెందిన వివిధ విభాగాల కార్యాలయాలు సికింద్రాబాద్‌కు తరలిపోతున్నాయి.

Updated : 14 Dec 2023 08:46 IST

విజయవాడ, తిరుపతిలో రైల్వే కన్‌స్ట్రక్షన్‌ అకౌంట్స్‌ కార్యాలయాల మూసివేత

ఈనాడు, అమరావతి: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు కొలిక్కి రాకపోవడంతో ఏపీలోని రైల్వేశాఖకు చెందిన వివిధ విభాగాల కార్యాలయాలు సికింద్రాబాద్‌కు తరలిపోతున్నాయి. దక్షిణ మధ్యరైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్‌కు ఒక్కో విభాగాన్ని విలీనం చేస్తూ, ఇక్కడి కార్యాలయాలను మూసివేస్తున్నారు. విజయవాడ, తిరుపతిలో ఉన్న రైల్వే కన్‌స్ట్రక్షన్‌ అకౌంట్స్‌ కార్యాలయాలను మూసివేసి వాటిని ప్రధాన కేంద్రంలో విలీనం చేసేలా ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఈనెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తికావాలని, జనవరి ఒకటి నుంచి వీటి కార్యకలాపాలు సికింద్రాబాద్‌ నుంచే జరగాలని కొద్దిరోజుల కిందట జారీచేసిన ఆదేశాల్లో పేర్కొంది. విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లలో జరిగే రైల్వే నిర్మాణ పనులు అన్నింటికీ.. కన్‌స్ట్రక్షన్స్‌ అకౌంట్స్‌ విభాగం నుంచి చెల్లింపులు జరిపేందుకు గతంలో విజయవాడ, తిరుపతిలో కార్యాలయాలు ఏర్పాటు చేశారు. నిర్మాణ పనుల బిల్లులను ఈ కార్యాలయాలకు ఆన్‌లైన్‌లో పంపిస్తే, వాటిని పరిశీలించి చెల్లింపులు చేస్తుంటారు. ఇప్పుడు ఈ రెండు కార్యాలయాలు మూసివేయడంపై ఉద్యోగులు విస్తుపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని