తిరుమలలో వసంతోత్సవ వైభవం

శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.

Updated : 23 Apr 2024 07:06 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు అత్యంత వైభవంగా సాగిన స్వర్ణ రథోత్సవంలో వేల మంది భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని వసంతోత్సవ మండపంలో వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు అభిషేకాదులు నిర్వహించారు. వసంతోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారితోపాటు శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవమూర్తులు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడ సేవను తితిదే రద్దు చేసింది.

భక్తులకు నేరుగా సర్వదర్శనం: ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా సోమవారం సాయంత్రం క్యూ లైన్లలో వచ్చిన భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం లభించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్నవారికి కొన్ని గంటల్లోనే శ్రీవారి దర్శనం లభిస్తోందని తితిదే తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని