అయిదేళ్లు చాల్లేదా..జగన్‌?

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పదే పదే చెబుతున్న వైకాపా ప్రభుత్వం.. వారి పిల్లల కోసం నిర్మించిన గురుకుల పాఠశాల భవనాన్ని మాత్రం పట్టించుకోలేదు.

Published : 24 Apr 2024 03:45 IST

ఈనాడు, నెల్లూరు: మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పదే పదే చెబుతున్న వైకాపా ప్రభుత్వం.. వారి పిల్లల కోసం నిర్మించిన గురుకుల పాఠశాల భవనాన్ని మాత్రం పట్టించుకోలేదు. కేవలం 20% పనులు చేస్తే భవనం అందుబాటులోకి వచ్చే వీలున్నా.. దాన్ని వదిలేసింది. నెల్లూరు రూరల్‌ పరిధిలోని అక్కచెరువుపాడులో తెదేపా ప్రభుత్వ హయాంలో మైనారిటీ గురుకుల పాఠశాల భవనం నిర్మించారు. రూ.19 కోట్లు వెచ్చించి డైనింగ్‌ సముదాయం, అధ్యాపకుల గదులు, హాస్టల్‌ సముదాయం పనులు 80 శాతం పూర్తి చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక దానిలో ఒక్క పనీ చేయలేదు. పిల్లలు అద్దె భవనంలో విద్యాభ్యాసం చేస్తున్నారు. అద్దె భవనం శిథిలావస్థకు చేరినా పట్టించుకోకుండా దానికే నెలకు రూ.1.10 లక్షల అద్దె చెల్లించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని