మీకు ఇన్సురెన్స్ పాల‌సీ ఉందా? అయితే ఈ విషయాల‌పై జాగ్ర‌త్త‌గా వ‌హించండి

బీమా పాల‌సీదారులు మోస‌గాళ్ల వ‌ల‌లో ప‌డ‌కుండా పాల‌సీ వివ‌రాల విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి

Published : 22 Dec 2020 15:25 IST

కొంతమంది మోస‌గాళ్లు తాము బీమా సంస్థ‌ల‌ మ‌ధ్య‌వ‌ర్తులమ‌ని చెప్పి పాల‌సీదారుల‌ను వివిధ ర‌కాలుగా మోసం చేస్తున్నారు. దీంతో తీసుకున్న‌ పాల‌సీ హామీ మొత్తాన్ని పొందేందుకు బీమా గురించి అవ‌గాహ‌న లేనివారు ఇబ్బందులు ప‌డుతున్నారు. కుటుంబంలో సంపాద‌నా ప‌రుడైన వ్య‌క్తి అనుకోని ప్ర‌మాదం వ‌ల‌న లేదా రోగాల భారిన ప‌డి అకాల మ‌ర‌ణం చెందితే ఆ కుటుంబంలో మిగిలిన వారు ఆర్ధికంగా ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండ‌టం కోసం ప్ర‌జ‌లు బీమా పాల‌సీని కొనుగోలు చేస్తారు.

వాస్త‌వానికి ఒక వ్య‌క్తి పాల‌సీ కొనుగోలు చేయ‌ద‌ల‌చినప్ప‌డు ఆ పాల‌సీ గురించిన పూర్తి వివ‌రాల‌ను తెలుసుకోవ‌డం, పాల‌సీ కొనుగోలు చేసిన నాటి నుంచి పాల‌సీ క్లెయిమ్‌ చేసే వ‌ర‌కు పాల‌సీ నిర్వ‌హ‌ణ‌లో ఏమి చేయాలి, ఏమి చేయ‌కూడ‌దు అనే విష‌యాల‌ను గురించిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. పాలసీ తీసుకునేముందు ఏమీ తెలుసుకోకుండా కొనుగోలు చేస్తే వాటి ద్వారా త‌ర్వాత అనేక స‌మ‌స్య‌లు ఎదురుకావొచ్చు. కొంద‌రు ఐఆర్‌డీఐ ప్ర‌తినిధుల‌మ‌ని చెప్తూ వృద్దుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని మోసాల‌కు పాల్ప‌డుతూ కోట్లాది రూపాయిలు లాభం పొందుతున్నారు.

పాల‌సీ దారులు తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌లు:

  1. బీమా ఏజెంట్ల‌తో వ్య‌వ‌హ‌రించేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా వుండండి. ముందుగా మీరు రిజ‌ష్ట‌ర్డ్‌/ లైసెన్సు పొందిన మ‌ధ్య‌వ‌ర్తితో వ్య‌వ‌హ‌రిస్తున్నారో లేదో త‌న‌ఖీ చేసుకోండి.

  2. ఐఆర్‌డీఏ ప్ర‌తినిధుల‌మ‌ని చెప్తూ వివిధ బీమా సంస్థ‌ల నుంచి ప‌లు ర‌కాల పాల‌సీల‌ను అందిస్తున్న‌ట్లు కొంత‌మంది న‌మ్మ‌బ‌లుకుతున్నారు.

  3. బీమా పాల‌సీల‌పై బోన‌స్ వ‌చ్చిన‌ట్లు, ఐఆర్‌డీఏ దీనిని పాల‌సీదారుల‌కు పంపిణీ చేస్తున్న‌ట్లు చెప్తుంటారు.

  4. పాల‌సీదారుడు ఐఆర్‌డీఐ అందించే బోన‌స్ పొందేందుకు కొన్ని నెల‌ల‌ స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్తున్నారు.

  5. అద‌న‌పు ప్ర‌యోజ‌నాల కోసం పాల‌సీ కోనుగోలు చేయాలనుకునే వ్య‌క్తి, ఇప్ప‌టికే అమ‌లులో ఉన్న పాల‌సీని అప్ప‌గించి, కొత్త పాల‌సీల‌ను కొనుగోలు చేయాల్సిందిగా దానిపై వ‌చ్చే లాభాల‌ను పొందేందుకు కొంత కాలం వేచి చూడాల్సిందిగా న‌మ్మిస్తున్నారు.

  6. స‌ర్వైవ‌ల్ బెనిఫిట్స్‌, మోచ్యూరిటీ ఆదాయం, బోన‌స్‌ల‌ను పొందడానికి ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న పాల‌సీతో పాటు కొత్త పాల‌సీల‌ను కొనుగోలు చేయడం త‌ప్ప‌నిస‌రి అని మోసం చేస్తున్నారు.

  7. పాల‌సీ కొనుగోలు చేయాల‌నుకున్న వారికి వివిధ ర‌కాల ఆఫ‌ర్ల‌ను అన‌గా బ‌హ‌మ‌తులు, ప్రోత్సాహ‌క ఆఫ‌ర్లు, వ‌డ్డీ లేని రుణాలు వంటి వాటిని చూపించి మోసాల‌కు పాల్ప‌డుతున్నారు.

  8. ఐఆర్‌డీఏ ప్ర‌త్య‌క్షంగా గాని, త‌మ ప్ర‌తినిధుల ద్వారా గాని ఏవిధ‌మైన ఇన్సురెన్సు పాల‌సీల‌ను, ఆర్ధిక ప‌ర‌మైన ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యించ‌దు.

  9. పాల‌సీ కొనుగోలు చేసిన వారికి లేదా పాల‌సీల‌కు ఎలాంటి బోన‌స్‌ను అందించ‌ద‌న్న విష‌యాన్ని ఐఆర్‌డీఏ తెలిపింది.

  10. ఇలాంటి వారిని న‌మ్మి మోస‌పోతే మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని