స్టీఫెన్ హాకింగ్ జీవితం తెలిపే 8 పెట్టుబడి పాఠాలు

ప్రపంచ ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, మార్చి 14, 2018 న మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అధిగ‌మించి ల‌క్ష్యాన్ని సాధించిన వ్యక్తి హాకింగ్....

Published : 16 Dec 2020 17:05 IST

స్టీఫెన్ హాకింగ్ జీవితం నుంచి గ్ర‌హించాల్సిన 8 ఆర్థిక పాఠాలు

అత‌నే ఒక విశ్వం

ప్రపంచ ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, మార్చి 14, 2018 న మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అధిగ‌మించి ల‌క్ష్యాన్ని సాధించిన వ్యక్తి హాకింగ్.

స్టీఫెన్ హాకింగ్ తన జీవితకాలంలో "బ్లాక్ హోల్స్, కాస్మోలజీలపై నిరంత‌రమైన ప‌రిశోధ‌న‌లు చేశారు. తన జీవితం కాలంలో తెలుసుకున్న వైజ్జ్ఞానిక విజ్జ్ఞానాన్ని సామాన్యుల‌కు అర్థ‌మైయ్యే రీతిలో విశ్వం ర‌హస్యాలు తెలిపేందుకు ఆయ‌న 15 పుస్తకాలు రాశారు. అతని అత్యుత్తమ అమ్మకాల పుస్తకాల్లో ఒకటి, “ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్” కొన్ని ల‌క్ష‌ల కాపీలు ప్రపంచవ్యాప్తంగా అమ్యుడ‌య్యాయి. ఈ పుస్త‌కం 40 భాషల్లోకి అనువాదం అయ్యింది.

సాధార‌ణ వ్య‌క్తి ఈ ప‌రిశోధ‌న‌లు చేయ‌డం గొప్ప విష‌యంగా అనుకుంటే హాకింగ్ అమ్యోట్రోఫిక్ లాటరల్ స్క్లేరోసిస్ (ఏఎల్ఎస్) తో బాధపడుతున్నాడు. ఇది శ‌రీరంలో నాడీవ్య‌వ‌స్థ‌ను బలహీనపరిచే వ్యాధి. దీనికి ఎలాంటి నివార‌ణ లేదు. అ వ్యాధి సోకిన 55 ఏళ్ల తర్వాత హాకింగ్ జీవిస్తూ విజ్ఞాన శాస్త్రంలో చేసిన ప‌రిశోధ‌న‌లు స్ఫూర్తిదాయ‌కంగా చెప్పాలి.

స్టీఫెన్ హాకింగ్ జీవితం నుంచి పెట్టుబడిదారులు గ్ర‌హించాల్సిన 8 ఆర్థిక పాఠాల‌ను తెలుసుకుందాం.

సవాళ్ళను గెల‌వ‌నీయ‌కండి‌

మీ పెట్టుబడి నిర్ణయాలు తప్పైన‌పుడు వాటిని చూసి కంగారు పడ‌కండి. ఒక సారి స్టీఫెన్ హాకింగ్ ను త‌ల‌చుకోండి. అరుదైన వ్యాధి సోకిన‌ వ్యక్తి తన జీవితమంతా వ్య‌క్తి కోలుకునేందుకు అవ‌కాశం లేద‌ని తెలిసీ కూడా త‌న ప‌రిశోధ‌న‌ను ఆప‌లేదు. విశ్వ‌ర‌హ‌స్యాల‌ను ఛేదించాల‌న్న అత‌ని ఆశ‌ను తగ్గించలేదు. అనిత‌ర‌మైన సాధ‌న‌, కృషితో మానవాళికి విశ్వ రహస్యాల గుట్టును తెలియ‌జేశాడు. పెట్టుబడి నిర్ణ‌యంలో ఏదైనా పొర‌పాటు జ‌రిగితే మ‌దుప‌ర్లు ఆందోళ‌న చెంద‌కుండా ఆలోచించ‌డం ప్రారంభించాలి.భ‌విష్య‌త్తును గొప్ప‌గా ఊహించి త‌ద‌నుగుణంగా పెట్టుబ‌డుల‌ను చేయండి.

ఆలోచనల‌పై ఆస‌క్తి

స్టీఫెన్ హాకింగ్ తన సవాళ్ళను ఎదుర్కొంటూనే సాధించిన విజ‌యాల‌కు కార‌ణాలు కొత్త ఆలోచనలు, నిరంత‌ర అభ్యాసం. హాకింగ్ విశ్వం రహస్యాలను అర్థం చేసుకోవడమే కాకుండా ఇతరులు అర్థం చేసుకోవడానికి ఈ విషయాలను సరళమైన రూపంలోకి తీసుకొచ్చారు. పెట్టుబడిదారుడిగా మీకు కొత్త ఆలోచనలు, వ్యూహాల‌ గురించి ఆసక్తి ఉండాలి. పొర‌పాటు ఎక్క‌డ జ‌రిగింది అనే ద‌గ్గ‌ర నుంచి ప్రారంభించ‌డం ద్వారా పొర‌పాటు చేయ‌ని స్థితికి చేరుకోవాలి. మీ పెట్టుబ‌డుల కూర్పుకు సంబంధించిన ఏయే విష‌యాల‌పై శ్ర‌ద్ధ వ‌హించాలి? వినూత్న‌మైన పెట్టుబ‌డి వ్యూహాల‌ను ర‌చించ‌డానికి ఏం తెలుసుకోవాలి? మొద‌లైన అంశాల‌ను దృష్టిలో ఉంచుకోవాలి.

సాధార‌ణ‌మే సౌల‌భ్యం

హాకింగ్ త‌న జీవితంలో చాలా క్లిష్ట‌మైనటువంటి విశ్వ విష‌యాల‌ను పుస్త‌కాల రూపంలో చాలా సుల‌భంగా అందించారు మ‌న‌కు. అదే మ‌న పెట్ట‌బ‌డుల‌కు అన్వ‌యించుకుంటే పెట్టుబ‌డి అంశాల‌ను సాధార‌ణంగా, ఒక ప‌ద్ధ‌తిగా ఉంచుకోండి.

కాలం చాలా విలువైన‌ది

విశ్వం రహస్యాలు అర్ధం చేసుకునే ప్ర‌య‌త్నంలో భాగం స్టీఫెన్ అపారమైన కృషి చేయటానికి 55 సంవత్సరాల జీవితాన్ని వెచ్చించారు. మీ పెట్టుబడి నిర్ణయాలలో సమయం విలువ కూడా అర్థం చేసుకోవాలి. త్వరితంగా, నిర్ణయాత్మకంగా ఉండాలి. మార్కెట్లో వేల‌కు వేలున్న మ్యూచువ‌ల్ ఫండ్లు, షేర్లు ఉన్నాయి. వాటితో పాటు బోలెడెంత స‌మాచారం ఉంది. స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డం ద్వారా పెట్టుబ‌డి చేసేందుకు మీకేం అవ‌స‌ర‌మో తెలుసుకోవ‌చ్చు.

చ‌మ‌త్కారం-చురుకుద‌నం

ఇది చాలా వింత‌గా వినిపించవచ్చు కానీ హాకింగ్ చెప్పేది వింటే అర్థ‌మ‌వుతుంది . “చురుకైన మనస్సు, హాస్యభావాన్నిక‌లిగి ఉండ‌టం నా మనుగడకు కీలకం” అని హాకింగ్ పేర్కొన్నాడు. ఒక పెట్టుబడిదారు లేదా వ్యాపారిగా మీరు నష్టాలను కూడా కొంత ఓర్పుతో స్వీక‌రించి నేర్పుతో ముందుకెళ్లాలి. మీకొచ్చిన నష్టాల ప‌ట్ల అతిగా ఆందోళ‌న చెంద‌కండి. పెట్టుబడుల్లో ఇది కూడా ఒక భాగమ‌ని గ్ర‌హించాలి.విజయవంతమైన పెట్టుబ‌డిదారుడు అవ్వాలంటే కొంత హాస్య‌భావం కావాలంటారు స్టీఫెన్ హాకింగ్.

తెలుసుకోండి…తెలియ‌జేయండి…

మీ ఆలోచనలు పంచుకోవ‌డం ద్వారా ఇత‌ర‌ల‌తో ఈ అంశాల‌పై మాట్లాడండి. దీని ద్వారా ప్రయోజనం పొందవచ్చు అతని జీవితమంతా పుస్తకాలు, పరిశోధన పత్రాలు, ఉపన్యాసాలు ద్వారా తన జ్ఞానాన్ని పంచుకున్నారు. పెట్టుబ‌డికి సంబంధించిన ఆలోచనలు పంచుకోవడం,మార్చుకోవడం చాలా అవ‌స‌రం. మీకొచ్చే సందేహాల‌కు స‌మాధానాలు దొర‌కుతాయి.

అంత‌రాయానికి చింతించ‌కండి

గొప్ప పెట్టుబ‌డిదారుల‌ను అడ‌గండి.ఎవ‌రైనా స‌వాళ్లు ఎదుర్కోకుండా విజ‌యాల‌ను సాధించామ‌ని చెబుతారేమో? మీకు ఎదుర‌య్యే అంత‌రాయాల‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. హాకింగ్ తన జీవితంలో,కెరీర్లో ప్రతికూలత‌ల‌ను ఎదుర్కొని పరిపూర్ణతను సాధించ‌డం చూడొచ్చు.మీ పోర్ట్ఫోలియో పనితీరులో ఊహించ‌ని మార్పులు మీరు ఏర్ప‌డితే ఎలా ఎదుర్కోవాలో కాకుండా, దానిపై ఎలా పెట్టుబడి పెట్టాలనేవిష‌యంపై ఆలోచించ‌డం ప్రారంభించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని