Ola Electric Scooter: ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల సేల్‌ షురూ.. ఎలా బుక్‌ చేయాలంటే?

ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు బుధ‌వారం విక్ర‌యానికి రానున్నాయి.

Updated : 30 Aug 2022 11:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ అమ్మ‌కాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. క‌స్ట‌మ‌ర్ల కోసం, కొనుగోళ్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను రూపొందించ‌డంలో సాంకేతిక ఇబ్బందుల కార‌ణంగా కంపెనీ త‌న అమ్మ‌కాల‌ను వారం పాటు వాయిదా వేసిన ఆ కంపెనీ.. తాజాగా అమ్మకాలను షురూ చేసింది. దీంతో ఇప్పటికే స్కూట‌ర్‌ను రిజ‌ర్వ్ చేసుకున్న క‌స్ట‌మ‌ర్లు మిగిలిన మొత్తాన్ని చెల్లించి కొనుగోలు పూర్తిచేయొచ్చు. వాహ‌న వేరియంట్‌, రంగు ఎంపిక‌ల‌ను ఖ‌రారు చేసుకోవ‌చ్చు.

ఓలా ఎల‌క్ట్రిక్ సీఈఓ భ‌విష్ అగ‌ర్వాల్ ట్విటర్‌లో స్కూట‌ర్ అమ్మ‌కాల‌ను ప్రారంభించిన‌ట్లు తెలియ‌చేశారు. రిజ‌ర్వేష‌న్ క్ర‌మంలో బుకింగ్‌లు తెరుస్తున్నారు. బుకింగ్ చేసుకున్న వారికి ఓ ఈ-మెయిల్‌కు వ‌స్తుంది. ఓలా యాప్‌లో కూడా వాహ‌నం గురించి స‌మాచారం ఉంటుంది. కంపెనీ గ‌త నెల‌లో ఓలా ఎస్ 1 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ని 2 వేరియంట్లలో ఎస్1, ఎస్1 ప్రో వ‌రుస‌గా రూ.99,999, రూ.1,29,999 వ‌ద్ద విడుద‌ల చేసింది. రాష్ట్రాలు ఇచ్చే స‌బ్సిడీలను బ‌ట్టి ధ‌ర మారొచ్చు.

బుకింగ్ పూర్తి చేయ‌డానికి 4 స్టెప్స్.. 
* మీరు ఇప్ప‌టికే ముంద‌స్తు బుకింగ్ ధ‌ర చెల్లించిన‌ట్ల‌యితే మీ ఫోన్ నంబ‌ర్‌ను ఉప‌యోగించి ఓలా ఎల‌క్ట్రిక్ వైబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వొచ్చు. కొనుగోలు చేయాల‌నుకుంటున్న వేరియంట్‌ను ఎంచుకోవ‌చ్చు. ఇంకా స్కూట‌ర్‌ను బుక్‌ చేయ‌క‌పోతే.. రూ.499 టోకెన్ మొత్తాన్ని క‌ట్టి స్కూట‌ర్‌ని బుక్ చేసుకోవ‌చ్చు. మీరు కొనుగోలు చేయ‌ద‌లిచిన వేరియంట్‌ను ఖ‌రారు చేసిన త‌ర్వాత అందుబాటులో ఉన్న 10 రంగుల్లో ఒక రంగు స్కూట‌ర్‌ను ఎంచుకోవాలి.

* త‌ర్వాత చెల్లింపు ట్యాబ్‌. మీరు ఎంచుకున్న వేరియంట్‌ని బ‌ట్టి, మీరు ఇపుడు మీ బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. స్కూట‌ర్‌కు ఫైనాన్స్ కావాలిస్తే ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

* స్కూట‌ర్‌కు ఫైనాన్సింగ్ అవ‌స‌ర‌మైతే ఓలా ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్.. ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా క్యాపిట‌ల్‌ స‌హా ప్ర‌ముఖ బ్యాంకుల‌తో ఒప్పందాలు చేసుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. ఓలా, ఓలా ఎల‌క్ట్రిక్ యాప్‌ల‌లో అర్హ‌త క‌లిగిన క‌స్ట‌మ‌ర్ల‌కు నిమిషాల్లో ప్రీ-అప్రూవ్డ్ లోన్లను అందిస్తుంది. టాటా క్యాపిట‌ల్‌, ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్ డిజిటల్ కేవైసీని ప్రాసెస్ చేస్తుంది. అర్హ‌త క‌లిగిన క‌స్ట‌మ‌ర్ల‌కు త‌క్ష‌ణ రుణాల ఆమోదాన్ని అందిస్తుంద‌ని కంపెనీ తెలిపింది. ఒక‌వేళ మీకు ఫైనాన్సింగ్ అవ‌స‌రం లేన‌ట్ల‌యితే, ఓలా ఎస్‌1 కోసం రూ. 20,000, ఓలా ఎస్‌1 ప్రో కోసం రూ.25,000 అడ్వాన్స్‌గా చెల్లించొచ్చు. మిగిలిన మొత్తాన్ని కంపెనీ మీకు ఇన్వాయిస్ చేసిన‌ప్పుడు చెల్లించొచ్చు.

* కొనుగోలు ఫార్మాలిటీలు పూర్త‌యిన త‌ర్వాత డెలివ‌రీ తేదీ అందిస్తారు. అక్టోబ‌ర్‌లో ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల డెలివ‌రీలు ప్రారంభ‌మ‌వుతాయి. ఇంటికే స్కూటర్‌ను డెలివరీ చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని