రుణ మేళాకి వెళ్తున్నారా?

చాలామంది భార‌తీయులు పెరుగుతున్న ఖ‌ర్చులకు ప్ర‌త్యామ్నాయంగా రుణాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. డిజిట‌ల్ రుణ సంస్థ క్యాష్ఇ నివేదిక ప్ర‌కారం 2018లో రీఫైనైన్స్ చేసేందుకు 23శాతం ఉద్యోగులు స్వ‌ల్ప కాల వ్య‌క్తి గ‌త రుణాలు తీసుకుని ఈఎమ్ఐల‌ను చెల్లిస్తుండ‌గా, 14 శాతం మంది వారి రుణాల‌ను చెల్లించేందుకు కొత్త రుణాల‌ను తీసుకున్నారు. విచ‌క్ష‌ణా ర‌క్షితంగా చేసే ఖ‌ర్చులు, రుణాల‌ను..

Updated : 01 Jan 2021 20:02 IST

చాలామంది భార‌తీయులు పెరుగుతున్న ఖ‌ర్చులకు ప్ర‌త్యామ్నాయంగా రుణాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. డిజిట‌ల్ రుణ సంస్థ క్యాష్ఇ నివేదిక ప్ర‌కారం 2018లో రీఫైనైన్స్ చేసేందుకు 23శాతం ఉద్యోగులు స్వ‌ల్ప కాల వ్య‌క్తి గ‌త రుణాలు తీసుకుని ఈఎమ్ఐల‌ను చెల్లిస్తుండ‌గా, 14 శాతం మంది వారి రుణాల‌ను చెల్లించేందుకు కొత్త రుణాల‌ను తీసుకున్నారు. విచ‌క్ష‌ణా ర‌క్షితంగా చేసే ఖ‌ర్చులు, రుణాల‌ను చెల్లించేందుకు తిరిగి రుణం తీసుకోవ‌డం వ‌ల్ల ఆర్థికంగా దెబ్బ‌తినే అవ‌కాశం ఉంటుంది.

అందువ‌ల్ల రుణ గ్ర‌హీత‌లు, రుణం తీసుకునే ముందు, వారికి నిజంగా రుణం అవ‌స‌ర‌మా? అని ప్ర‌శ్నించుకోవాలి. గృహ కోనుగోలు, లేదా వాహ‌నం, ఇంకేదైనా వ‌స్తువు కొనుగోలు చేస్తున్నారా…ఎందుకోసం రుణం తీసుకోవాల‌నుకుంటున్నారు అనే అంశంపై స్ప‌ష్ట‌త ఉండాలి. సుల‌భంగా రుణాలు ల‌భించ‌డం రుణ గ్ర‌హీత‌ల‌కు ఆర్థికంగా అంత శ్రేయ‌స్క‌రం కాదు. ముఖ్యంగా పండ‌గ సీజ‌న్ ముందు ల‌భించే రుణాలు అధిక లేదా అన‌వ‌ర‌పు ఖ‌ర్చుల‌కు ప్రేరేపిస్తాయి.

తిరిగి చెల్లించే సామ‌ర్ధ్యం ఉందా?
పండుగ సీజ‌న్‌లో ఎదుర‌య్యే ఖ‌ర్చుల కోసం సుల‌భంగా రుణాలు ల‌భించ‌డం చాలా మందికి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. అయితే రుణం తీసుకోవ‌డం అంటే తీసుకున్న రుణాల‌ను స‌కాలంలో వ‌డ్డీతో స‌హా చెల్లించాల్సి ఉంటుంద‌ని గుర్తించుకోవాలి. నిజానికి చాలా మంది ఆర్థికంగా దెబ్బ‌తిన‌డానికి కార‌ణం, తీసుకున్న రుణాల‌ను భ‌విష్య‌త్తులో వ‌డ్డీతో స‌హా చెల్లించాల్సి రావ‌డ‌మే. ఒక‌వేళ ఏదైనా కార‌ణం వ‌ల్ల రెండు నుంచి మూడు నెల‌ల పాటు ఆదాయం ఆగిపోతే రుణాలు తిరిగి చెల్లించ‌గ‌ల సామ‌ర్ధ్యం ఉందానేది చూసుకోవాలి.

అధిక ప్ర‌మాణాల‌తో కూడిన జీవ‌న శైలి కోసం సుల‌భంగా ల‌భించే రుణాల‌ను తీసుకుంటారు. అయితే ఇది మిమ్మ‌ల్ని ఆర్థికంగా దిగ‌జార్చుతుంది. పండుగ ముందు రుణ మేళా అనే ప‌దం చాలా మందికి ఇంపుగా అనిపించ‌వ‌చ్చు. అయితే రుణం తీసుకునే ముందు, మీకు నిజంగా రుణం అవ‌స‌ర‌మా? ఎందుకోసం తీసుకుంటున్నాము? ఎంత మొత్తం తీసుకుంటున్నాము? వ‌డ్డీతో పాటు తిరిగి చెల్లించే సామ‌ర్ధ్యం ఉందా? త‌దిత‌ర విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని