మాల్యా ఆస్తుల్ని విక్రయించుకోవచ్చు

విజయ్‌ మాల్యా నుంచి రూ.5,646 కోట్ల మొండి బకాయిలు వసూలు చేసుకునేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియం ఆయన స్థిరాస్తులు, షేర్లు విక్రయించుకునే అవకాశాన్ని

Published : 04 Jun 2021 02:41 IST

బ్యాంకులకు అనుమతి ఇచ్చిన పీఎంఎల్‌ఏ న్యాయస్థానం

దిల్లీ: విజయ్‌ మాల్యా నుంచి రూ.5,646 కోట్ల మొండి బకాయిలు వసూలు చేసుకునేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియం ఆయన స్థిరాస్తులు, షేర్లు విక్రయించుకునే అవకాశాన్ని న్యాయస్థానం కల్పించింది. మాల్యాకు రుణాలు ఇచ్చిన 11 బ్యాంకుల బృందం మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కోర్టును ఆశ్రయించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) స్వాధీనం చేసుకున్న మాల్యా ఆస్తుల్ని తాము విక్రయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. దీనికి ముంబయిలోని పీఎంఎల్‌ఏ కోర్టు అనుమతి ఇస్తూ, రూ.5,646.54 కోట్ల విలువైన ఆస్తులు, షేర్లను బ్యాంకులు విక్రయించుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చింది. మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు ఎస్‌బీఐ రూ.6,900 కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రూ.800 కోట్లు, ఐడీబీఐ బ్యాంక్‌ రూ.800 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.650 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.550 కోట్లు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.410 కోట్ల రుణాలిచ్చాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని