Satya Nadella: సత్య నాదెళ్లకు సీకే ప్రహ్లాద్‌ అవార్డు

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ, భారత సంతతికి చెందిన సత్య నాదెళ్లకు గ్లోబల్‌ బిజినెస్‌ సస్టెయినబిలిటీ లీడర్‌షిప్‌ విభాగంలో ప్రఖ్యాత సీకే ప్రహ్లాద్‌ అవార్డ్‌ దక్కింది. భారతీయ అమెరికన్....

Updated : 14 Oct 2021 09:47 IST

వాషింగ్టన్‌: మైక్రోసాఫ్ట్‌ సీఈఓ, భారత సంతతికి చెందిన సత్య నాదెళ్లకు గ్లోబల్‌ బిజినెస్‌ సస్టెయినబిలిటీ లీడర్‌షిప్‌ విభాగంలో ప్రఖ్యాత సీకే ప్రహ్లాద్‌ అవార్డ్‌ దక్కింది. భారతీయ అమెరికన్‌ అయిన ప్రహ్లాద్‌ గౌరవార్థం 2010లో కార్పొరేట్‌ ఈకో ఫోరమ్‌(సీఈఎఫ్‌) ఏర్పాటు చేసిన ఈ అవార్డును అంతర్జాతీయప్రైవేటు రంగంలో పర్యావరణహిత కార్యక్రమాలను అసాధారణ రీతిలో, వినూత్నతతో నిర్వహిస్తూ, దీర్ఘకాల వ్యాపార విజయాలను కలిగి ఉన్న వారికి ఇస్తుంటారు. నాదెళ్లతో పాటు మైక్రోసాఫ్ట్‌ ప్రెసిడెంట్‌, వైస్‌ ఛైర్‌ బ్రాడ్‌ స్మిత్‌, సీఎఫ్‌ఓ అమీ హుడ్‌, చీఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఆఫీసర్‌ లుకాస్‌ జొప్పలు కూడా ఈ గౌరవాన్ని అందుకున్నారు. 2030 కల్లా కర్బన రహిత సంస్థగా మైక్రోసాఫ్ట్‌ను మార్చడం; 2050 కల్లా చరిత్రాత్మక ఉద్గారాలన్నిటినీ తొలగించాలన్న లక్ష్యంతో కలిసికట్టుగా పనిచేస్తున్నందుకు ఈ ప్రఖ్యాత అవార్డు దక్కింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని