ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, జియోలకు రూ.9200 కోట్ల బ్యాంక్‌ హామీల విడుదల

లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రమ్‌ వినియోగ ఛార్జీల కోసం భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియోలు డిపాజిట్‌ చేసిన దాదాపు రూ.9200 కోట్ల బ్యాంక్‌ హామీలను టెలికాం విభాగం (డాట్‌) విడుదల చేసిందని సంబంధిత

Published : 04 Dec 2021 01:35 IST

దిల్లీ: లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రమ్‌ వినియోగ ఛార్జీల కోసం భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియోలు డిపాజిట్‌ చేసిన దాదాపు రూ.9200 కోట్ల బ్యాంక్‌ హామీలను టెలికాం విభాగం (డాట్‌) విడుదల చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబరులో టెలికాం రంగానికి ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీలో భాగంగా డాట్‌ ఈ చర్యలు చేపట్టింది. గత నెలలో ఎయిర్‌టెల్‌కు దాదాపు రూ.4000 కోట్లు, వొడాఫోన్‌ ఐడియాకు రూ.2500 కోట్లు, జియోకు రూ.2700 కోట్ల మేర బ్యాంక్‌ హామీలు విడుదలయ్యాయని సమాచారం. టెలికాం ఆపరేటర్ల బ్యాంక్‌ హామీ అవసరాల్లో 80 శాతం మేర డాట్‌ కోత విధించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని