అంబుజా సిమెంట్స్‌, ఏసీసీల ఓపెన్‌ ఆఫర్‌ జులై 6 నుంచి!

అంబుజా సిమెంట్స్‌, ఏసీసీల ఓపెన్‌ ఆఫర్‌ జులై 6 నుంచి వెల్లడించిన తాత్కాలిక షెడ్యూల్‌ ఆధారంగా తెలుస్తోంది. ఈ రెండు సంస్థలకు కలిపి ప్రకటించిన రూ.31,129 కోట్ల ఓపెన్‌ ఆఫర్‌.. దేశ కార్పొరేట్‌ చరిత్రలోనే అతిపెద్ద ఓపెన్‌ ఆఫర్‌గా

Published : 24 May 2022 02:54 IST

దిల్లీ:అంబుజా సిమెంట్స్‌, ఏసీసీల ఓపెన్‌ ఆఫర్‌ జులై 6 నుంచి వెల్లడించిన తాత్కాలిక షెడ్యూల్‌ ఆధారంగా తెలుస్తోంది. ఈ రెండు సంస్థలకు కలిపి ప్రకటించిన రూ.31,129 కోట్ల ఓపెన్‌ ఆఫర్‌.. దేశ కార్పొరేట్‌ చరిత్రలోనే అతిపెద్ద ఓపెన్‌ ఆఫర్‌గా నిలవనుంది. హిందుస్థాన్‌ యునిలీవర్‌లో 48.7 కోట్ల షేర్ల కొనుగోలుకు యునిలీవర్‌ ప్రకటించిన రూ.29,220 కోట్లే ఇప్పటివరకు అతిపెద్ద ఓపెన్‌ ఆఫర్‌గా ఉంది. అంబుజాలో 63%, ఏసీసీలో 4.5 శాతం వాటాను స్వీడన్‌కు చెందిన హోల్సిమ్‌ నుంచి అదానీ గ్రూపునకు చెందిన మారిషస్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థ సుమారు రూ.50,000 కోట్ల)కు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌లకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించడం ఆ సంస్థకు తప్పనిసరి అయ్యింది. ఈ ఓపెన్‌ ఆఫర్‌ కింద అంబుజా సిమెంట్స్‌లో 26% వాటాకు సమానమైన 51.6 కోట్ల షేర్లను ఒక్కోటి రూ.385 చొప్పున మారిషస్‌లోని అదానీ గ్రూపునకు చెందిన సంస్థ కొనుగోలు చేయనున్నట్లు ఎండీవర్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆధారంగా తెలుస్తోంది. ఇందుకు రూ.19,879 కోట్లు వెచ్చించనుంది. ఏసీసీలో 26 శాతం వాటాకు సమానమైన షేర్లను ఒక్కో షేరుకు రూ.2,300 చొప్పున మొత్తంగా రూ.11,259 కోట్లకు కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూపు ఆఫర్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని