ఉమ్మ‌డిగా రుణం తీసుకుంటే ఎవ‌రు క్లెయిమ్ చేసుకోవాలి?

గృహ కొనుగోలుదారులు ఎక్కువ‌గా ఇద్ద‌రు క‌లిపి ఉమ్మ‌డిగా స్థిరాస్తి కొనుగోలు చేయ‌డం చూస్తుంటాం. బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు కూడా రుణం దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ విధ‌మైన స‌ల‌హానే ఇస్తుంటాయి. అయితే ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఎవ‌రు చేయాలి. ఎవ‌రికి ప‌న్ను మిన‌హాయింపులు

Published : 19 Dec 2020 22:03 IST

గృహ కొనుగోలుదారులు ఎక్కువ‌గా ఇద్ద‌రు క‌లిపి ఉమ్మ‌డిగా స్థిరాస్తి కొనుగోలు చేయ‌డం చూస్తుంటాం. బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు కూడా రుణం దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ విధ‌మైన స‌ల‌హానే ఇస్తుంటాయి. అయితే ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఎవ‌రు చేయాలి. ఎవ‌రికి ప‌న్ను మిన‌హాయింపులు వ‌ర్తిస్తాయ‌న్న విష‌యంలో చాలా మందికి అర్థంకాక గంద‌ర‌గోళానికి గుర‌వుతుంటారు. ఇంటిని భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రి పేరుతో లేదా ఇత‌ర బందువుల పేరుతో క‌లిపి కొనుగోలు చేస్తుంటారు. ముందుచూపు, భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా ఈ నిర్ణ‌యాలు తీసుకుంటారు. అయితే ఒక్కోసారి భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రి పేరు మీద ఇల్లు ఉంటే ఎవ‌రు క్లెయిమ్ చేసుకోవాల‌నే ప్ర‌శ్ర త‌లెత్తుతోంది.

ఆదాయ ప‌న్ను చ‌ట్టం 1961 ప్ర‌కారం, స్థిరాస్తి నుంచి ఎవ‌రు ఆదాయం పొందుతున్నారో వారు ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. ఒక‌వేళ ప‌న్ను చెల్లింపుదారుడు ఒక ఇంటిని మాత్ర‌మే క‌లిగి ఉంటే దాని నుంచి ఎలాంటి ఆదాయం రాదు కాబ‌ట్టి, వార్షిక విలువ‌ను శూన్యంగా భావిస్తారు. అదేవిధంగా ఇంటికోసం తీసుకున్న రుణంపై చెల్లిస్తున్న‌ వ‌డ్డీపై రెండు ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. సాధార‌ణంగా ఆస్తి పైన ఆదాయం పొందుతుంటే వారిని య‌జ‌మానిగా గుర్తిస్తారు. ఆదాయ ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం స్థిరాస్తి కోసం ఎవ‌రు పెట్టుబ‌డులు పెట్టారో వారిపై ప‌న్ను ప‌డుతుంది. మొత్తం ఈఎమ్ఐ ఎవ‌రు చెల్లిస్తారో వారికి ప‌న్ను క్లెయిమ్ చేసుకోవ‌చ్చు అలాగే వ‌డ్డీపై కూడా మిన‌హాయింపు ల‌భిస్తుంది.

అయితే, భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ లేదా స‌హ య‌జ‌మాని, ఎవ‌రైతే క‌లిపి స్థిరాస్తి కొనుగోలు చేసారో వారు క‌లిసి ఈఎమ్ఐ చెల్లిస్తున్న‌ట్ల‌యితే ఇద్ద‌రూ స‌మానంగా క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. దీనికోసం హోమ్‌లోన్ ఉమ్మ‌డిగా న‌మోదు చేసుకొని ఉండాలి. అప్పుడు ఇద్ద‌రూ స్టాంప్ డ్యూటీ, రిజిస్ర్టేష‌న్ ఛార్జీలు, వడ్డీ, మొత్తంపై క్లెయిమ్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. ఇద్ద‌రూ క్లెయిమ్ చేసుకోవాలంటే ఇద్ద‌రు పేరుమీద రుణం తీసుకొని ఉండ‌టంతో పాటే ఈఎమ్ఐలు, వ‌డ్డీని ఇద్ద‌రూ చెల్లించాలి. ఒక‌వేళ త‌ల్లిదండ్రులు, వారి పిల్ల‌ల పేరును న‌మోదు చేసి ఇంటి రుణం తీసుకుంటే, మొద‌ట త‌ల్లిదండ్రులు రుణం చెల్లించి త‌ర్వాత పిల్ల‌లు చెల్లిస్తే, పిల్ల‌లు స‌హ‌-య‌జ‌మానులుగా క్లెయిమ్ చేసుకునే అవ‌కాశం ఉండ‌దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని