మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ల‌ను డీమ్యాట్ ఖాతాలోకి మార్చుకోవ‌డం ఎలా

గ‌తంలో కొనుగోలు చేసినమ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ల‌ను కూడా డీమ్యాట్ లోకి మార్చుకోవ‌చ్చు.............

Published : 19 Dec 2020 13:13 IST

గ‌తంలో కొనుగోలు చేసినమ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ల‌ను కూడా డీమ్యాట్ లోకి మార్చుకోవ‌చ్చు.​​​​​​​

మ‌దుప‌ర్లు త‌మ‌కు ఉండే వివిధ ర‌కాల పెట్టుబ‌డుల‌ను ఒకే చోట ఉంచుకోవాల‌ని అనుకుంటారు. దీని ద్వారా ఏయే పెట్టుబ‌డుల‌లో ఎంతెంత మ‌దుపు చేశామో తెలుసుకోవ‌చ్చు. మ‌ధ్య‌లో పోర్టుఫోలియోలో ఏవైనా మార్పులు చేర్పులు చేయాల‌న్నా సుల‌భంగా ఉంటుంది. డీమ్యాట్ ఖాతాలో మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ల‌ను భ‌ద్ర‌ప‌రుచుకోవ‌చ్చు.

ఎలా అంటే…

మ‌దుప‌ర్లు ఏవైనా మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ల‌ను త‌మ డీమ్యాట్ ఖాతాలో మార్చుకోవాల‌నుకుంటే వాటికి సంబంధించి క‌న్వ‌ర్ష‌న్ రిక్వెస్ట్ ఫార‌మ్ (సీఆర్ఎన్) నింపి దానిని డిపాజిట‌రీ పార్టిసిపేంట్ కు అందించాలి. కొత్త‌గా పెట్టుబ‌డి చేసే మ‌దుప‌ర్లు ప్రారంభంలోనే త‌మ యూనిట్లు డీమ్యాట్ రూపంలో కావాల‌ని కోర‌వ‌చ్చు. నిర్బంధిత కాల‌ప‌రిమితి వ‌ర‌కూ కొన‌సాగించాల్సిన యూనిట్లు, ఏవిధ‌మైన కాల‌ప‌రిమితిలేని యూనిట్ల‌కు వేర్వేరుగా సీఆర్ఎసీఆర్ఎన్ ద‌ర‌ఖాస్తులు చేయాలి.

ఏయే వివ‌రాలు కావాలి?

డీమ్యాట్ రూపంలో యూనిట్ల‌ను మార్చుకునేందుకు

  • డీపీ ఐడీ, క్ల‌యింట్ ఐడీ
  • పెట్టుబ‌డి చేసిన వారి పేర్లు
  • ఫోలియో నంబ‌రు త‌దిత‌ర‌ వివ‌రాలు కావాలి.

మార్చుకోవ‌డం ఇలా…

మొత్తం యూనిట్ల సంఖ్య పైన పేర్కొన్న వివ‌రాల‌తో కూడిన ద‌ర‌ఖాస్తు ఫారంను త‌దిత‌ర వివ‌రాల‌తో సీఆర్ఎన్ ఫారం నింపి డీపీకి అందించాలి. అనంత‌రం డిపాజిట‌రీ పార్టిసిపేంట్ మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ల‌ను డీమెటిరీలైజ్ చేయాల్సిందిగా ఏఎమ్‌సీ లేదా ఆర్‌టీఏ కు సందేశం పంపింస్తారు. అనంత‌రం మ‌దుప‌ర్లు త‌మ డీమ్యాట్ లో యూనిట్ల‌ను చూసుకోవ‌చ్చు.

డిపాజిట‌రీ పార్టిసిపేంట్లు మ‌దుప‌ర్ల యూనిట్ల వివ‌రాలు డిపాజిట‌రీ లో న‌మోదుచేసే భాద్య‌త‌ను తీసుకుంటాయి. దాదాపు అన్ని ఏఎమ్‌సీలు, బ్రోకింగ్ సంస్థ‌లు త‌మ సొంతంగా డిపాజిట‌రీ పార్టిసిపేంట్‌గా రిజిస్ట్ర‌ర్ చేసుకుంటారు. డిపాజిట‌రీ సంస్థ లు డిపాజిట‌రీల వ‌ద్ద ఖాతాను క‌లిగి ఉంటాయి. దేశంలో ఎన్ఎస్‌డీఎల్, సీఎస్‌డీఎల్ రెండు డిపాజిట‌రీలు ఉన్నాయి. వీటిలోనే మ‌దుప‌ర్లు సెక్యూరిటీల‌కు సంబంధించిన వివ‌రాలు ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని