Narayana Murthy: యువత వారానికి 70 గంటలు పనిచేయాలి: ఇన్ఫీ నారాయణ మూర్తి

Narayana Murthy on work hours: ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే దేశంలోని యువత అదనపు గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అన్నారు. దీన్ని ఓ ప్రతిజ్ఞగా తీసుకోవాలన్నారు.

Published : 27 Oct 2023 01:41 IST

Narayana Murthy | బెంగళూరు: ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) అన్నారు. అప్పుడే అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ నిలవలగలదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు 3వన్‌4 క్యాపిటల్‌ తొలి పాడ్‌కాస్ట్‌ ‘ది రికార్డ్‌’ అనే ఎపిసోడ్‌లో ఆయన మాట్లాడారు. ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్‌ పాయ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణం, టెక్నాలజీ, ఇన్ఫోసిస్‌ సహా పలు అంశాల గురించి మాట్లాడారు.

ప్రపంచ దేశాలతో పోలిస్తే దేశంలో ఉత్పాదకత తక్కువని నారాయణ మూర్తి (Narayana Murthy) ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. చైనా వంటి దేశాలతో పోటీపడాలంటే యువత అదే తరహాలో పనిచేయాల్సిన అవసరం ఉందని నారాయణ మూర్తి అన్నారు.

యూట్యూబర్‌పై సెబీ కొరడా.. రూ.17 కోట్లు కట్టాలని ఎందుకు ఆదేశించింది?

‘‘ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఉత్పాదకత చాలా తక్కువ. మన దేశంలో ఉత్పాదకత పెరగకుండా.. ప్రభుత్వంలో ఒక స్థాయిలో వేళ్లూనుకున్న అవినీతిని తగ్గించకుండా.. అధికార నిర్ణయాల్లో జాప్యం తొలగకుండా.. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడడం సాధ్యం కాదు. కాబట్టి ‘యువత ఇదీ నా దేశం. నా దేశం కోసం వారానికి 70 గంటలు కష్టపడతాను’ అనే ప్రతిజ్ఞ తీసుకోవాలి’’ అని నారాయణమూర్తి అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్లు, జపానీయులు ఇదే పనిచేశాయన్నారు. ప్రతి జర్మన్‌ అదనపు గంటలు పనిచేయాలని నిర్ణయించుకుని కొన్నేళ్ల పాటు ఆ పనిచేశారని గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని