ఎఫ్‌డీ వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రించిన ఎస్‌బీఐ

ఎఫ్‌డీల‌ను ట‌ర్మ్ డిపాజిట్లు అని కూడా అంటారు.

Published : 12 Jan 2021 12:34 IST

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) అత్యంత ప్రాచుర్యం పొందిన, ఇష్ట‌ప‌డే పెట్టుబ‌డి సాధ‌నాల్లో ఒక‌టి. ముఖ్యంగా సీనియ‌ర్ సిటిజ‌న్లు, పెన్ష‌న‌ర్లు న‌మ్మ‌క‌మైన పెట్టుబ‌డి సాధ‌నం కాబ‌ట్టి  బ్యాంక్ ఎఫ్‌డీల‌నే ఆశ్ర‌యిస్తారు.

దేశంలో ప్ర‌ముఖ, అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) రేట్ల‌ను స‌వ‌రించింది. ఎఫ్‌డీల‌ను ట‌ర్మ్ డిపాజిట్లు అని కూడా అంటారు.

8 జ‌న‌వ‌రి 2021 నుండి సాధార‌ణ క‌స్ట‌మ‌ర్ల కోసం రూ. 2 కోట్లు, ఇంత‌క‌న్నా త‌క్కువ డిపాజిట్ల‌కు ఎస్‌బీఐ తాజా ఎఫ్‌డీ వ‌డ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 

7 రోజుల నుండి 45 రోజుల వ‌ర‌కు - 2.9%

46 రోజుల నుండి 179 రోజుల వ‌ర‌కు - 3.9%

180 రోజుల నుండి 210 రోజుల వ‌ర‌కు - 4.4%

211 రోజుల నుండి 1 సంవ‌త్స‌రం క‌న్నా త‌క్కువ - 4.4%

1 సంవ‌త్స‌రం నుండి 2 సంవ‌త్స‌రంల క‌న్నా త‌క్కువ - 5%

2 సంవ‌త్స‌రాల నుండి 3 సంవ‌త్స‌రాల క‌న్నా త‌క్కువ - 5.1%

3 సంవ‌త్స‌రాల నుండి 5 సంవ‌త్స‌రాల క‌న్నా త‌క్కువ - 5.3%

5 సంవ‌త్స‌రాలు మ‌రియు 10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు - 5.4%

ఎస్‌బీఐ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అద‌నంగా 50 బిపిఎస్ వ‌డ్డీ రేటును అందిస్తుంది. తాజా వ‌డ్డీ రేట్ల స‌వ‌ర‌ణ త‌ర్వాత సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 7 రోజుల నుండి 10 సంవ‌త్స‌రాల‌లో మెచ్యూరిటీ చెందుతున్న ఎఫ్‌డీల‌పై 3.4% నుండి 6.2% వ‌ర‌కు వ‌డ్డీని పొందుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని