Crime news: ఇంటికి పిలిచి.. డ్రింక్‌ ఆఫర్‌ చేసి.. విద్యార్థినిపై యువకుల దారుణం

బార్క్‌ ఉద్యోగుల క్వార్టర్స్‌లో 19 ఏళ్ల విద్యార్థినిపై తెలిసిన వ్యక్తే దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో ఇద్దరు యువకుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Updated : 19 Nov 2023 20:13 IST

ముంబయి:  ముంబయిలో బాబా అటామిక్‌ రీసెర్చి సెంటర్‌(BARC) ఉద్యోగుల క్వార్టర్స్‌లో దారుణం చోటుచేసుకుంది. కళాశాల విద్యార్థిని(19)పై ఇద్దరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. చెంబూరు పోస్టల్‌ కాలనీ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి తండ్రి బార్క్‌లో పనిచేస్తుండగా ఆయనకు క్వార్టర్‌ కేటాయించారు. అయితే, బాధితురాలి తండ్రి విధి నిర్వహణలో భాగంగా వేరే చోటకు వెళ్లారు. నిందితుడి (26) తండ్రి కూడా అదే సంస్థ ఉద్యోగి కావడంతో వీరిద్దరూ ఒకే భవనంలోని వేర్వేరు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. దీంతో ఒకరితో ఒకరికి పరిచయం ఉందని పోలీసులు తెలిపారు.

బెజవాడలో కార్ల రేసింగ్‌.. 2 ముక్కలైన స్కూటీలు

అయితే, బుధవారం రాత్రి నిందితుడి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లడంతో తన స్నేహితుడిని (30) ఇంటికి ఆహ్వానించాడు. ఆహారం వండుకొనేందుకు ఇండక్షన్‌ స్టవ్‌ అవసరం కావడంతో.. తమ ఇంట్లో నుంచి తీసుకురావాలని బాధితురాలిని కోరారు. దీంతో వాటిని తీసుకొని వెళ్లిన విద్యార్థిని.. కాసేపు అక్కడే ఉండి వారితో మాట్లాడింది. ఈ క్రమంలోనే ఆమెకు మత్తు మందు కలిపిన కూల్‌ డ్రింక్‌ను ఆఫర్‌ చేశారు. దాన్ని తాగిన విద్యార్థిని స్పృహ కోల్పోవడంతో నిందితులిద్దరూ ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. గురువారం తెల్లవారు జామున ఆమెకు స్పృహ రావడంతో తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలుసుకొని విలపించింది. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు చెంబూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని