Vijayawada: బెజవాడలో కార్ల రేసింగ్‌.. 2 ముక్కలైన స్కూటీలు

విజయవాడలో శనివారం అర్ధరాత్రి కార్ల రేసింగ్‌ జరిగింది. బెంజ్‌, ఫార్చ్యూనర్‌ కార్లతో యువతీ, యువకులు రేస్‌ నిర్వహించారు.

Published : 19 Nov 2023 11:08 IST

విజయవాడ: నగరంలోని జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి కార్ల రేసింగ్‌ జరిగింది. బెంజ్‌, ఫార్చ్యూనర్‌ కార్లతో యువతీ, యువకులు రేస్‌ నిర్వహించారు. ఈ క్రమంలో రామవరప్పాడు వైపు వెళ్తున్న 2 స్కూటీలను పోటీలో ఉన్న ఓ ఫార్చూనర్‌ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలైన వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన స్కూటీలు రెండు ముక్కలవ్వగా.. కారు ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాదానికి కారకులైన ఫార్చూనర్‌ కారులోని యువతి, యువకుడు మరో కారులో పరారయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని