Bob Dylon: ‘56 ఏళ్ల క్రితం నన్ను లైంగికంగా హింసించాడు’

అమెరికాకు చెందిన ప్రసిద్ధ గాయకుడు, గీత రచయిత, నోబెల్‌ పురస్కార గ్రహీత బాబ్‌ డిలాన్‌(80) 56 ఏళ్ల క్రితం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ..

Published : 18 Aug 2021 12:50 IST

ప్రసిద్ధ గాయకుడు బాబ్‌ డిలాన్‌పై కోర్టుకెక్కిన ఓ మహిళ

లాస్‌ ఏంజెలెస్‌: అమెరికాకు చెందిన ప్రసిద్ధ గాయకుడు, గీత రచయిత, నోబెల్‌ పురస్కార గ్రహీత బాబ్‌ డిలాన్‌(80) 56 ఏళ్ల క్రితం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ మహిళ కోర్టుకెక్కింది. ప్రస్తుతం 68 ఏళ్లున్న ఆమె గత వారం తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ న్యూయార్క్‌ సుప్రీంకోర్టులో కేసు వేసింది. తనకు 12 ఏళ్ల వయసున్నప్పుడు డిలాన్‌ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించింది. తనను తీవ్ర శారీరక, మానసిక హింసకు గురిచేసినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. 1965లో మే, ఏప్రిల్‌ మధ్య సుమారు ఆరు వారాల పాటు డిలాన్‌ తన అపార్టుమెంటులోనే పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పింది. డిలాన్‌ను కఠినంగా శిక్షించాలని అభ్యర్థించింది. ఆమె ఆరోపణలను డిలాన్‌ కొట్టిపడేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని