Bihar: యువతితో సన్నిహితంగా ఉన్నాడని.. ప్రియుడి మర్మాంగాలను...
యువతితో ఏకాంతంగా ఉన్నాడన్న కారణంతో యువకుడి మర్మాంగాలను తొలగించిన ఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్
ముజఫర్‌పూర్: యువతితో ఏకాంతంగా ఉన్నాడన్న కారణంతో యువకుడి మర్మాంగాలను తొలగించిన ఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని కాంతి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీంతో ఆ యువకుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న యువకుడి బంధువులు మృతదేహాన్ని తీసుకుని, నిందితుల ఇంటి ముందే అంత్యక్రియలు నిర్వహించారు. ముజఫర్‌పూర్ జిల్లా ఎస్పీ రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రెపురా రాంపుర్షా గ్రామానికి చెందిన సురభ్ కుమార్ కొంత కాలంగా సొరభా గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడు. శుక్రవారం యువతిని కలుసుకునేందుకు సురభ్ కుమార్ ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో యువతితో సురభ్ కుమార్ సన్నిహితంగా ఉండటం చూసిన యువతి బంధువులు ఆగ్రహంతో అతనిపై దాడి చేసి మర్మాంగాలను కోశారు. తీవ్రంగా గాయపడిన అతణ్ని స్థానికులు దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురభ్ కుమార్ మృతి చెందాడు.
సురభ్ కుమార్ మృతితో కోపోద్రిక్తులైన అతడి బంధువులు దాడిలో ప్రధాన నిందితుడిగా ఉన్న సుషాంత్ పాండే అనే వ్యక్తి ఇంటిపై దాడి చేసి మృతదేహానికి అతడి ఇంటి ముందే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కేసులో సుషాంత్ పాండేతోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు వేగవంతం చేసి యువకుడి కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో అతడి బంధువులు ఆందోళన విరమించారు. సుషాంత్ పాండే ఇంటిపై దాడి చేసిన ఘటనలో కూడా పోలీసులు సురభ్ కుమార్ బంధువులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. నా తుది జట్టులో జడ్డూ ఉండడు: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
-
Politics News
Rahul Gandhi: ఇలాంటివి సాధ్యమని నేను ఊహించలేదు: రాహుల్ గాంధీ
-
Movies News
Siddharth: నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడిని.. ‘ఇండియన్2’ పై సూపర్ న్యూస్ చెప్పిన సిద్దార్థ్
-
India News
Uttarakhand: కొండచరియల బీభత్సం.. చిక్కుకుపోయిన 300 మంది ప్రయాణికులు
-
Politics News
YSRCP: కర్రసాము చేస్తూ కిందపడిన వైకాపా ఎమ్మెల్యే
-
Crime News
Kamareddy: ఆపరేషన్ థియేటర్లో ఏసీ నుంచి మంటలు