Crime Newss: ఫేక్‌ ఆఫర్‌ లెటర్లతో మోసం.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల పేరిట ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. తమకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్‌, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల నుంచి నిరుద్యోగుల తల్లిదండ్రులు చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌కు క్యూ కట్టారు.

Published : 19 Feb 2024 14:50 IST

చంద్రగిరి: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల పేరిట ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. తమకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్‌, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల నుంచి నిరుద్యోగుల తల్లిదండ్రులు చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌కు క్యూ కట్టారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

చంద్రగిరికి చెందిన పాశం గురుప్రసాద్, అతడి స్నేహితుడు బండకింద రెడ్డప్ప నిరుద్యోగుల నుంచి సుమారు రూ.50లక్షలు వసూలు చేశారని బాధితుల తల్లిదండ్రులు తెలిపారు. ప్రముఖ సంస్థల్లో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు గురుప్రసాద్‌ పరిచయం చేసుకునేవాడని చెప్పారు. విప్రో, టెక్‌ మహీంద్రా తదితర కంపెనీల పేరుతో మెయిల్స్‌ ద్వారా ఫేక్‌ ఆఫర్‌ లెటర్లు పంపించేవాడన్నారు. వాటితో ఆయా కంపెనీలకు వెళితే మోసపోయినట్లు తెలిసిందని వివరించారు. గురు ప్రసాద్‌, రెడ్డప్ప ఖాతాలో చాలా మంది బాధితులు ఉన్నారని చెప్పారు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని