
Crime News: తనయుడి మరణం తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
హైదరాబాద్: తనయుడి ఆకస్మిక మరణం తట్టుకోలేక తండ్రి తనువు చాలించిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక అంబేడ్కర్ నగర్లో భార్య, కుమారుడితో కలిసి లక్ష్మణ్ నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు గత కొంతకాలంగా మూర్చవ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో నిన్న మరణించాడు. తనయుడి మృతిని తట్టుకోలేక లక్ష్మణ్ ఇవాళ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒక్క రోజు వ్యవధిలో తండ్రి, కొడుకు మృతి చెందడంతో అంబేడ్కర్‌నగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. లక్ష్మణ్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల రోదనలు మిన్నంటాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.