కేరళలో ఏనుగు దాడి.. కెమెరామన్‌ దుర్మరణం

కేరళలో గుంపు నుంచి తప్పిపోయిన అడవి ఏనుగు దాడిలో ఎ.వి.ముకేశ్‌ (34) అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ ‘మాతృభూమి’ కెమెరామన్‌గా, కాలమిస్ట్‌గా పనిచేస్తున్న ముకేశ్‌ రిపోర్టరుతో కలిసి మలమ్‌పుఝా - కంజికోడ్‌ మార్గంలో నదిని దాటే ఏనుగుల గుంపు దృశ్యాల చిత్రీకరణకు వెళ్లాడు.

Updated : 09 May 2024 06:16 IST

పాలక్కాడ్‌: కేరళలో గుంపు నుంచి తప్పిపోయిన అడవి ఏనుగు దాడిలో ఎ.వి.ముకేశ్‌ (34) అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ ‘మాతృభూమి’ కెమెరామన్‌గా, కాలమిస్ట్‌గా పనిచేస్తున్న ముకేశ్‌ రిపోర్టరుతో కలిసి మలమ్‌పుఝా - కంజికోడ్‌ మార్గంలో నదిని దాటే ఏనుగుల గుంపు దృశ్యాల చిత్రీకరణకు వెళ్లాడు. అడవి ఏనుగులు తరచూ సంచరించే ప్రాంతమది. గుంపు నుంచి తప్పిపోయిన ఏనుగు వారిపై దాడి చేసిన సమయంలో రిపోర్టరు, వాహన డ్రైవరు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఏనుగు చేతికి చిక్కి తీవ్రంగా గాయపడిన ముకేశ్‌ను సమీప ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. మలప్పురం జిల్లాకు చెందిన ముకేశ్‌ రిపోర్టింగులోనూ తన ప్రతిభను చాటుకొని అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలను చిత్రీకరిస్తూ ‘‘అథిజీవనమ్‌’’ శీర్షిక కింద మాతృభూమి ఆన్‌లైన్‌ ఎడిషనుకు వంద వ్యాసాలకు పైగా రాశాడు. వివాహితుడైన ఇతడు ఆ కాలంలో పేర్కొన్న పేదలకు తన జీతం నుంచి ఆర్థికసహాయం చేసేవాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తదితరులు ముకేశ్‌ మృతికి సంతాపం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని