ఈవీఎంలలో చిప్‌ మారుస్తా.. మిమ్మల్ని గెలిపిస్తా

డబ్బులిస్తే ఈవీఎంలలో చిప్‌ను మార్చి ఎక్కువ ఓట్లు పడేలా చేస్తానని మోసగించేందుకు యత్నించిన ఓ జవానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 09 May 2024 03:44 IST

శివసేన(యూబీటీ) నేతను రూ.2.5 కోట్లు డిమాండ్‌ చేసిన జవాను అరెస్ట్‌

ఛత్రపతి శంభాజీనగర్‌: డబ్బులిస్తే ఈవీఎంలలో చిప్‌ను మార్చి ఎక్కువ ఓట్లు పడేలా చేస్తానని మోసగించేందుకు యత్నించిన ఓ జవానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో పోలింగ్‌ విధుల్లో ఉన్న ఆర్మీ జవాను మారుతీ దక్‌నే (42) ఈవీఎంలలో చిప్‌ను మార్చి అధిక ఓట్లు పడేలా చేస్తానంటూ శివసేన (యూబీటీ) నేత అంబాదాస్‌ దాన్వేను ఆశ్రయించాడు. గతంలో ఈ విధానం ఓ అభ్యర్థి విజయానికి ఉపయోగపడిందని నమ్మబలికాడు. ఇందుకోసం తనకు రూ. 2.5 కోట్లు ఇవ్వాలని డిమాండు చేశాడు. దీనిపై దాన్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మంగళవారం అంబాదాస్‌ తమ్ముడు రాజేంద్ర ఓ హోటల్‌లో మారుతీతో సమావేశమయ్యారు.  చర్చల తర్వాత రూ.1.5 కోట్లకు ఒప్పందం కుర్చుకుని, టోకెన్‌ మొత్తం కింద రూ.లక్ష ఇచ్చారు. సాధారణ దుస్తుల్లో అక్కడే మాటువేసిన పోలీసులు వెంటనే సైనికుడిని పట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని