అత్యాచారం కేసు నిందితుడు 40 ఏళ్ల తర్వాత దొరికాడు

అత్యాచారం కేసులో పరారీలో ఉన్న నిందితుడిని 40 ఏళ్ల తర్వాత అరెస్టు చేసిన ముంబయి పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ముంబయికి చెందిన పాపా అలియాస్‌ దావూద్‌ 1984లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Published : 09 May 2024 03:47 IST

ఈటీవీ భారత్‌: అత్యాచారం కేసులో పరారీలో ఉన్న నిందితుడిని 40 ఏళ్ల తర్వాత అరెస్టు చేసిన ముంబయి పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ముంబయికి చెందిన పాపా అలియాస్‌ దావూద్‌ 1984లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 1985లో ఈ కేసుపై బాంబే సెషన్స్‌కోర్టులో విచారణ జరిగింది. ఆ విచారణకు పాపా హాజరుకాలేదు. దీంతో అతడు పరారీలో ఉన్నట్లు సెషన్స్‌జడ్జి ప్రకటించారు. నిందితుడిపై స్టాండింగ్‌ నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. అప్పటినుంచీ ఈ కేసు పెండింగులో ఉండిపోయింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున పాత రికార్డుల్లో పరారీలో ఉన్న నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు ముంబయి డీసీపీ మోహిత్‌ కుమార్‌ గార్గ్‌ స్పెషల్‌డ్రైవ్‌ చేపట్టారు. ఈ క్రమంలో పాపా గురించి ఆరాతీయగా.. ముంబయిలో ఉన్న ఇంటిని అమ్మి ఎటో వెళ్లిపోయినట్లు తెలిసింది. నిందితుడితో పరిచయమున్న ఓ వ్యక్తితోపాటు ఇన్‌ఫార్మర్ల ద్వారా పాపా ఆగ్రాలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని