Cyber Crime: భారీ మోసం.. చెల్లింపు సేవల సంస్థకు హ్యాకర్ల షాక్‌

మహారాష్ట్రలోని ఠాణేలో జరిగిన ఓ భారీ సైబర్‌ మోసం పోలీసులను విస్తుపోయేలా చేసింది. ఒక చెల్లింపు సేవల సంస్థకు చెందిన వ్యవస్థను హ్యాక్‌ చేసిన దుండగులు వేల బ్యాంకు ఖాతాల నుంచి విడతల వారీగా రూ.16,180 కోట్లు దోచుకున్నారు.

Updated : 09 Oct 2023 06:49 IST

ఖాతాల నుంచి రూ.16 వేల కోట్లు మాయం

ఠాణె: మహారాష్ట్రలోని ఠాణేలో జరిగిన ఓ భారీ సైబర్‌ మోసం పోలీసులను విస్తుపోయేలా చేసింది. ఒక చెల్లింపు సేవల సంస్థకు చెందిన వ్యవస్థను హ్యాక్‌ చేసిన దుండగులు వేల బ్యాంకు ఖాతాల నుంచి విడతల వారీగా రూ.16,180 కోట్లు దోచుకున్నారు. ఎంతో కాలంగా ఈ మోసం జరుగుతున్నప్పటికీ నిర్వాహకులు గుర్తించలేకపోయారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.25 కోట్ల మేర మోసం జరిగిందని నిర్వాహకులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు తీగ లాగగా డొంకంతా కదిలింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి గతంలో వివిధ బ్యాంకుల్లో రిలేషన్‌షిప్‌, సేల్స్‌ మేనేజర్‌గా పనిచేసిన జితేంద్ర పాండేతో పాటు సంజయ్‌ సింగ్‌, అమోల్‌ అండాలే, అమన్‌ కేదార్‌, సమీర్‌ డియ్‌ఘేలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపిన పోలీసులు.. ఈ భారీ రాకెట్‌ వెనుక మరికొందరు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. నిందితుల నుంచి కొన్ని నకిలీ డాక్యుమెంట్లను సేకరించామని, పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ చెల్లింపు సేవల సంస్థతో లావాదేవీలు జరిపిన వివిధ సంస్థలు, వ్యక్తులపై ఈ మోసం ప్రభావం పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని