ఇసుకాసురుల కాసుల వేటలో.. మరో యువకుడు బలి

వైకాపా నాయకుల అండదండలతో ఇష్టారాజ్యంగా చేపడుతున్న ఇసుక తవ్వకాలతో మరో యువకుడు మృతిచెందారు.

Published : 27 Mar 2024 05:15 IST

సీతానగరం, న్యూస్‌టుడే: వైకాపా నాయకుల అండదండలతో ఇష్టారాజ్యంగా చేపడుతున్న ఇసుక తవ్వకాలతో మరో యువకుడు మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా పోలవరం ప్రాంతానికి చెందిన గోపాల శివశంకర్‌(21) తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. రెండేళ్ల క్రితం తండ్రిని కోల్పోవడంతో కూలి పనులకు వెళ్తూ తల్లిని పోషిస్తున్నారు.

మంగళవారం మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ముగ్గళ్ల గోదావరి నదిలో స్నానానికి వెళ్లారు. అక్కడ నలభై అడుగుల మేర ఇసుక గుంతలు ఉండటంతో శివశంకర్‌ ప్రమాదవశాత్తు మునిగిపోయారు. స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం దొరికింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు. గత కొంతకాలంగా గోదావరిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుతున్నా.. యంత్రాంగం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని