కుమారుణ్ని కొట్టిచంపి.. గోనెసంచిలో చుట్టి పడేశారు!

మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో కుమారుణ్ని తల్లిదండ్రులే కొట్టిచంపి గోనెసంచిలో చుట్టి బయట పడేశారు. ఇందౌర్‌ విమానాశ్రయ పోలీస్‌స్టేషను పరిధిలో ఏప్రిల్‌ 26న గోనెసంచిలో చుట్టి ఉన్న మృతదేహం పారిశుధ్య కార్మికులకు కనిపించింది.

Published : 05 May 2024 04:24 IST

ఇందౌర్‌: మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో కుమారుణ్ని తల్లిదండ్రులే కొట్టిచంపి గోనెసంచిలో చుట్టి బయట పడేశారు. ఇందౌర్‌ విమానాశ్రయ పోలీస్‌స్టేషను పరిధిలో ఏప్రిల్‌ 26న గోనెసంచిలో చుట్టి ఉన్న మృతదేహం పారిశుధ్య కార్మికులకు కనిపించింది. మృతదేహాన్ని చుట్టిన గోనెసంచిపై ఉన్న చిరునామా ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. మృతుడు సుధాంశు ఏప్రిల్‌ 24న కన్నతల్లిని దారుణంగా వేధించాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. దంపతులిద్దరూ కలిసి తెల్లవారుజామున సుధాంశును సుత్తి, స్క్రూడైవరుతో కొట్టి హత్య చేశారు. మృతదేహాన్ని రెండు రోజులు ఇంట్లోనే ఉంచాక దుర్వాసన రావడంతో సుధాంశు తండ్రి రాజారామ్‌ ఏప్రిల్‌ 26 తెల్లవారుజామున బైక్‌పై తీసుకువెళ్లి నిర్జన ప్రదేశంలో పడేశాడు. సమీపంలో ఉన్న సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. రాజారామ్‌ను అరెస్టు చేశామని, తల్లిని నిందితురాలిగా చేర్చినట్లు ఇందౌర్‌ డీసీపీ వినోద్‌కుమార్‌ మీనా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని