Crime News: కారు పోయిందా.. దిల్లీలో వెతకాల్సిందే!

లక్షలు కుమ్మరించి కొన్న వాహనాలను రెప్పపాటులో కొట్టేస్తున్నారు దొంగలు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సునాయాసంగా సరిహద్దు దాటిస్తున్నారు. తక్కువ ధరకు అమ్మేసి సొమ్మ చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో 2019-21 మధ్య 6884 వాహనాలు చోరీకి గురికాగా

Updated : 14 Feb 2022 14:17 IST

 అడ్డదారిలో సంపాదనకు వాహన దొంగతనాలు
 మహానగరంలో ఏటా 400- 500 కార్లు మాయం

స్వాధీనం చేసుకున్న కార్లను పరిశీలిస్తున్న పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌:  లక్షలు కుమ్మరించి కొన్న వాహనాలను రెప్పపాటులో కొట్టేస్తున్నారు దొంగలు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సునాయాసంగా సరిహద్దు దాటిస్తున్నారు. తక్కువ ధరకు అమ్మేసి సొమ్మ చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో 2019-21 మధ్య 6884 వాహనాలు చోరీకి గురికాగా వాటిలో 1200-1500 వరకూ ఖరీదైన కారులే ఉన్నాయి. ఇటీవల రాచకొండ పోలీసులు ఆలయాల్లో చోరీ చేస్తున్న ముఠాను అరెస్ట్‌ చేసినపుడు ఊహించని విషయం వెలుగుచూసింది. వీరు చోరీలు ప్రారంభించే ముందు ఖరీదైన కారును అపహరిస్తారు. అదే కంపెనీ, రంగు ఉన్న కారు నెంబరును చోరీ చేసిన వాహనానికి అమర్చుతారు. అవసరం తీరాక తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

ఇమ్రాన్‌ఖాన్‌ పఠాన్‌                     సత్యేంద్రసింగ్‌ షెకావత్‌

ఒక్కో చోరీకి ఒక్కో లెక్కుంది

నగరానికి చెందిన చమన్‌ సతీష్‌ ముఠా నకిలీ ఆధార్‌కార్డులు, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లతో చోరీచేసిన వాహనాలకు దర్జాగా యాజమాన్య మార్పిడి చేయించారు. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాల ఆర్‌సీలను రవాణాశాఖ యజమానుల ఇంటికి పోస్టల్‌/కొరియర్‌ ద్వారా పంపుతుంది. కొన్ని చిరునామాలు సరిగా లేక తిరిగి కార్యాలయాలకు చేరుతుంటాయి. ఆ శాఖలోని ఇంటిదొంగల సాయంతో వాటిని సేకరించి వేలంలో కొన్న/కొట్టేసిన వాహనాలకు అనుకూలంగా మార్చేవారు. మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్‌ఖాన్‌ పఠాన్‌ క్యాబ్‌ డ్రైవర్‌గా కాప్రాలో మకాం వేశాడు. ముఠాను తయారు చేసి అర్ధరాత్రి దాటాక ఖరీదైన కార్ల అద్డాలను తొలగించి తాళాలు సేకరించేవారు. అరగంటలో నకిలీ తాళం తయారు చేసి తీసుకెళ్లేవారు. 5 ఏళ్ల వ్యవధిలో 100కు పైగా కార్లను చోరీ చేశాడు. కృష్ణా జిల్లా మహేష్‌ నూతన్‌ కుమార్‌.. కార్లను అద్దెకిచ్చే యాప్‌లనే బురిడీ కొట్టించి 20కు పైగా ఎత్తుకెళ్లి అమ్మాడు. రాజస్థాన్‌కు చెందిన కరడుగట్టిన కార్ల దొంగ సత్యేంద్రసింగ్‌ షెకావత్‌ హ్యాండ్‌బేబీ యాప్‌ ద్వారా ఖరీదైన కార్ల తాళాలను క్లోనింగ్‌ చేసి 90 కార్లు చోరీ చేసి అమ్మేశాడు.
ఇట్నుంచి అటు.. అట్నుంచి ఇటు..
తెలుగు రాష్ట్రాల్లో కొట్టేసిన వాహనాలకు నకిలీ నంబరు ప్లేట్లు అమర్చి సరిహద్దు దాటిస్తారు. దిల్లీ, ముంబయి, పుణె,  బెంగళూరు నగరాలకు చేర్చుతారు. అక్కడ నకిలీ పత్రాలు తయారు చేసి చాలా మెకానిక్‌లు, డ్రైవర్లకు కమీషన్‌ ఆశచూపి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇక్కడ దొంగిలించిన అధికశాతం కార్లను దిల్లీలో విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇలాంటి వాహనాలను విక్రయించేందుకు శంషాబాద్‌, అత్తాపూర్‌, అబిడ్స్‌, నారాయణగూడ, సికింద్రాబాద్‌, ఉప్పల్‌ ప్రాంతాల్లోనూ దళారులున్నారు. వీరి ద్వారానే నకిలీపత్రాలు సృష్టించి వాహనాలను సెకండ్‌హ్యాండ్‌ మార్కెట్‌లో అమ్ముతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కొట్టేసిన వాహనాలు ఇక్కడ, ఇక్కడ చోరీ చేసినవి ఇతర రాష్ట్రాలకు చేర్చి విక్రయిస్తుంటారు.
పోలీసుల సూచనలివి

* ద్విచక్రవాహనాలకు వీల్‌లాక్‌ ఉపయోగించాలి. ఏడాదికోసారి తాళం మార్చాల్యి అపరిచితులకు లిఫ్ట్‌ ఇవ్వొద్దు.

*  స్టీరింగ్‌, క్లచ్‌, బ్రేక్‌లాక్‌ వంటి సురక్షిత పరికరాలు వాడాల్యి బూట్‌ సహాయంతో కారుడోర్‌లను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయాల్యి

*  కిటీకీలు పైకి లేపిన తరువాతనే లాక్‌ చేసి పార్క్‌ చేయాల్యి పార్కింగ్‌కు కేటాయించిన స్థలంలోనే వాహనాలు నిలపాల్యి వాహన తాళాలను సురక్షితంగా ఉంచాలి.

*  దొంగలు వాటిని గుర్తించి నకిలీ తయారు చేసే అవకాశం ఉంద్యి కారులో లౌడ్‌ అలారం సిస్టమ్‌ ఏర్పాటు చేయాలి.

* వాహనాలకు బీమా చేస్తుండాలి. గడువు ముగియకముందే వాయిదా చెల్లించాల్యి వాహనాలను రద్దీగా/వెలుతురున్న ప్రాంతాల్లో నిలపాలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని