ఏపీ సీఐడీ పోలీసులు కులం పేరుతో దూషించారు

ఏపీ సీఐడీ పోలీసులు తనను కులం పేరుతో దూషించారని తెదేపా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్‌ అనుచరుడు విజయ్‌ చంద్రబాబు ఆరోపించారు.

Published : 04 Oct 2022 03:27 IST

చింతకాయల విజయ్‌ అనుచరుడి ఆరోపణ

హైదరాబాద్‌ (జాబ్లీహిల్స్‌), న్యూస్‌టుడే: ఏపీ సీఐడీ పోలీసులు తనను కులం పేరుతో దూషించారని తెదేపా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్‌ అనుచరుడు విజయ్‌ చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం బంజారాహిల్స్‌ పోలీసులకు విన్నవించేందుకు ఆయనతో కలిసి స్టేషన్‌కు వెళ్లగా.. ఫిర్యాదును తీసుకోలేదని తెదేపా నేతలు పేర్కొన్నారు. వివరాలివి. చింతకాయల విజయ్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 3లో నివసిస్తున్నారు. ఈనెల 1న ఆయన నివాసానికి వచ్చిన ఏపీ సీఐడీ పోలీసులు.. విజయ్‌ ఇంట్లో లేకపోవడంతో పనిమనిషికి నోటీసులిచ్చి వెళ్లారు. ఇదే సమయంలో తన సెల్‌ఫోన్‌ లాక్కొని దాడి చేశారని విజయ్‌ అనుచరుడు  విజయ్‌ చంద్రబాబు అదే రోజు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడే ఏపీ సీఐడీ పోలీసులు తనను కులం పేరుతోనూ దూషించారంటూ సోమవారం తెలంగాణ తెదేపా నేతలు పి.జయరాం, ఆరిఫ్‌, తిరునగరి జ్యోత్స్న తదితరులతో కలిసి మరోసారి ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వచ్చారు. ఈ ఫిర్యాదు స్వీకరించడానికి పోలీసులు నిరాకరించారు. 1న ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేయలేదని, సోమవారం వెళితే ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారని తెదేపా నేత పి.జయరాం ఆరోపించారు. ఇప్పటికే ఇచ్చిన బాధితుడి ఫిర్యాదు పరిశీలనలో ఉందని పోలీసులు వివరణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని