Germany: స్కూల్‌లో బొమ్మ తుపాకీతో బెదిరింపులు.. ఇద్దరు బాలురు అరెస్టు

తరగతి గదిలోకి చొరబడి బొమ్మతుపాకీతో బెదరింపులకు పాల్పడిన నలుగురు బాలురను జర్మనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం హాంబర్గ్‌లోని ఓ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

Updated : 09 Nov 2023 02:57 IST

బెర్లిన్‌: తరగతి గదులోకి చొరబడి బొమ్మ తుపాకీ (Toy Gun) తో బెదిరింపులకు పాల్పడిన నలుగురు బాలురను జర్మనీ (Germany) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం హాంబర్గ్‌లోని బ్లాంకెనీస్‌లో ఉన్న ఓ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట దుండగులు తుపాకీతో బెదిరించినట్లు పాఠశాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. విద్యార్థులందరినీ అక్కడి నుంచి స్థానిక మిలటరీ స్థావరానికి తరలించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు 12 - 14 ఏళ్ల వయసున్న నలుగురు బాలురని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు బొమ్మ తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. వారిలో ఇద్దరే ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు. దర్యాప్తును కొనసాగించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని