Nalgonda : రెండు రోడ్డు ప్రమాదాల్లో.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

నల్లొండ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. 

Updated : 25 Dec 2023 10:15 IST

నిడమనూరు: నల్లొండ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురితోపాటు మరో వ్యక్తి మృతి చెందాడు. పెద్దవూర మండలం నిమ్మానాయక్‌ తండాకు చెందిన కేశవులు(28) అనే యువకుడు ఆదివారం రాత్రి  బైక్‌పై మిర్యాలగూడ నుంచి పెద్దవూర వెళ్తూ.. సైదులు (55) అనే పాదచారిని ఢీ కొట్టాడు. నిడమనూరులోని వేంపాడు సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న కేశవులు కుటుంబ సభ్యులు ఏడుగురు సోమవారం తెల్లవారుజామున టాటా ఏస్‌ వాహనంలో ఘటనాస్థలికి బయల్దేరి వెళ్లారు.

వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ప్రమాదస్థలికి అర కిలోమీటరు దూరంలో ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రమావత్‌ గన్యా (40), నాగరాజు(28), పాండ్య(40), బుజ్జి(38) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న  హాలియా సీఐ గాంధీనాయక్‌, నిడమనూరు ఎస్సై గోపాల్‌రావు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని