AP NEWS: ఇలాంటి కష్టం ఏ తల్లికీ రాకూడదు: రమ్య తల్లి జ్యోతి

నగరంలోని కాకాని రోడ్డులో ఈనెల 15న బీటెక్‌ విద్యార్థిని దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఓ దుండగుడు విద్యార్థిని రమ్యను కత్తితో పొడిచి

Updated : 19 Aug 2021 19:19 IST

గుంటూరు: నగరంలోని కాకాని రోడ్డులో ఈనెల 15న బీటెక్‌ విద్యార్థిని దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఓ దుండగుడు విద్యార్థిని రమ్యను కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనపై తాజాగా రమ్య తల్లి జ్యోతి, సోదరి మౌనిక స్పందించారు.

రమ్య తల్లి జ్యోతి బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘నిందితుడికి త్వరగా శిక్ష పడాలని కోరుకుంటున్నాం. ఇలాంటి కష్టం ఏ తల్లికీ రాకూడదు. మా కుటుంబానికి సీఎం పూర్తిగా అండగా ఉన్నారు. రమ్య ఘటన తర్వాత సీఎం జగన్‌ స్పందించారు. ప్రభుత్వం తరఫున రూ.10లక్షల ఆర్థిక సాయం అందించారు. మరో రూ.4.5లక్షల చెక్కును కూడా అందించారు. మా పెద్దమ్మాయికి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. ప్లాటు, పొలం కూడా ఇస్తామని చెప్పారు. మాపై ఒత్తిడి తెచ్చి ఇలా చెప్పిస్తున్నారనేది అబద్ధం’’ అని వివరించారు. రమ్య సోదరి మౌనిక మాట్లాడుతూ.. సీఎం చెల్లిగా భావించి తమ కుటుంబాన్ని ఆదుకున్నారని తెలిపారు. నాలుగు రోజుల్లోనే ప్రభుత్వం అన్ని ప్రయోజనాలను ఇచ్చిందన్నారు. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేశారని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని