logo

అనాథలైన చిన్నారులకు మేమున్నామని..

ఖానాపూర్‌ పురపాలికలో పొరుగు సేవల్లో ఉద్యోగినిగా విధులు నిర్వర్తిస్తున్న అంబేడ్కర్‌ కాలనీకి చెందిన సంగర్తి కవిత ఇటీవల విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.

Published : 05 Oct 2022 04:11 IST


ఆర్థిక సహాయం అందజేస్తున్న ఎంఈఎఫ్‌ నాయకులు

నిర్మల్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఖానాపూర్‌ పురపాలికలో పొరుగు సేవల్లో ఉద్యోగినిగా విధులు నిర్వర్తిస్తున్న అంబేడ్కర్‌ కాలనీకి చెందిన సంగర్తి కవిత ఇటీవల విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. భర్త సంగర్తి జానీ ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి అక్కడే గుండెపోటుతో అంతకుముందే మృత్యువాత పడ్డారు. దీంతో ఆ దంపతుల 12 ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కూతురు అనాథలుగా మిగిలారు. వారి దీనస్థితిని చూసిన మాదిగ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (ఎంఈఎఫ్‌) ఆధ్వర్యంలో రూ.50,600 జమ చేశారు. వీటిని జిల్లా కేంద్రంలో చిన్నారులకు మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తెడ్డు లింగన్న, రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి కుంటాల పోశెట్టి, కార్యదర్శి ఆనందబాబు, నాయకులు గడ్‌చాంద ముత్యం, సొన్న గంగాధర్‌, టి.రాజు, రత్నపురం లక్ష్మణ్‌, సంగర్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని