logo

దసరా ఉత్సవ మైదానాల పరిశీలన

జిల్లా కేంద్రంలో నిర్వహించే దసరా ఉత్సవ మైదానాలను మున్సిపల్‌ ఛైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ మంగళవారం పరిశీలించారు.

Published : 05 Oct 2022 04:36 IST


దస్నాపూర్‌లోని దసరా మైదానంలో రావణుడి బొమ్మను పరిశీలిస్తున్న
మున్సిపల్‌ ఛైర్మన్‌ ప్రేమేందర్‌, ఉత్సవ సమితి ప్రతినిధులు

ఆదిలాబాద్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే : జిల్లా కేంద్రంలో నిర్వహించే దసరా ఉత్సవ మైదానాలను మున్సిపల్‌ ఛైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ మంగళవారం పరిశీలించారు. తొలుత దస్నాపూర్‌లోని దసరా మైదానంలో ఏర్పాట్ల గురించి మున్సిపల్‌ సిబ్బంది, హిందూ సమాజ్‌ ఉత్సవ సమితి ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. వేడుకకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధ్యక్ష, కార్యదర్శులు హన్మాండ్లు, కృష్ణకుమార్‌ ఉపలంచివార్‌, ఉపాధ్యక్షులు ఉదయ్‌, విశ్వనాథ్‌, కోశాధికారి కోరెడ్డి లెనిన్‌ ఉన్నారు.

* జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగే దసరా ఉత్సవ ఏర్పాట్లను మున్సిపల్‌ ఛైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. సమితి అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్‌ ఖత్రి, కోశాధికారి పడకంటి సూర్యకాంత్‌, సభ్యులు రేణికుంట్ల రవీందర్‌, లోలపు శ్రీనివాస్‌, తోట పరమేశ్వర్‌, మాదస్తు సంతోష్‌, పొట్టిపల్లి విజయ్‌కుమార్‌, మహిపాల్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని