Nagoba Jatara: విశ్వశాంతి కోరుతూ 2.5 కిలోల తైలం తాగిన తొడసం ఆడపడుచు
విశ్వశాంతి కోరుతూ ఆదివాసీ తొడసం వంశీయుల ఆడపడుచు మెస్రం నాగుబాయి శనివారం ఉదయం 2.5 కిలోల నువ్వుల నూనె(నాటు) తాగారు.
నువ్వుల నూనె తాగుతున్న నాగుబాయి
నార్నూర్, న్యూస్‌టుడే : విశ్వశాంతి కోరుతూ ఆదివాసీ తొడసం వంశీయుల ఆడపడుచు మెస్రం నాగుబాయి శనివారం ఉదయం 2.5 కిలోల నువ్వుల నూనె(నాటు) తాగారు. ఏటా పవిత్ర పుష్యమాసంలో ఖాందేవునికి మహాపూజ మరుసటి రోజు తైలం తాగడం ఆనవాయితీ. 21వ వ్రతాన్ని మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా కొద్దెపూర్ గ్రామానికి చెందిన తొడసం మారుబాయి- దేవు దంపతుల కూతురు మెస్రం నాగుబాయి చందు పూర్తి చేసింది. తొడసం వంశం ఆడపడుచు మూడు సంవత్సరాల పాటు తైలం తాగే వ్రతాన్ని తీసుకొని పూర్తి చేస్తుంటారు. 1961 సంవత్సరంలో తొలిసారి ఖాందేవుని పూజతో ప్రారంభమైన ఈ వ్రతాన్ని గతేడాది వరకు 20 మంది తొడసం ఆడపడుచులు పూర్తి చేశారు. ఈ సారి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు మెస్రం నాగుబాయి పేర్కొన్నారు.
* ఈ విషయమై తొడసం వంశ కటోడా(పూజారి)లు తొడసం బాపూరావు, తొడసం ఆనంద్‌రావు, తొడసం పాండు, తొడసం నాగోరావులు మాట్లాడుతూ.. తొడసం వంశస్థుల ఆరాధ్య దైవం ఖాందేవుడికి పూజలు చేస్తే అడవిలో వన్యప్రాణులను రక్షిస్తాడని, ప్రజలు శాంతియుత జీవనానికి దోహదపడతాడని పేర్కొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణలోని వివిధ ప్రాంతాల తొడసం వంశీయులతో పాటు సోయిర్యాల్, ధాయిర్యాల్ మెస్రం శేఖర్, ఆలయ కమిటీ ఛైర్మన్ మెస్రం రూప్‌దేవ్ పటేల్, తొడసం దేవ్‌రావు, తొడసం గోవింద్‌రావు, తొడసం జ్యోతిరామ్, తొడసం గోపాల్, తొడసం తెలంగ్‌రావు, వివిధ గ్రామాల ఆదివాసీలు, భక్తులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Parineeti-Raghav : ఒక్కటైన ‘రాగ్నీతి’.. లీలా ప్యాలెస్‌లో వైభవంగా వివాహం
-
Economy: దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో భాజపా ప్రభుత్వం విఫలం: కాంగ్రెస్
-
Tagore Movie: పాటలు వద్దన్న మురగదాస్.. అలా ఛాన్స్ దక్కించుకున్న వినాయక్
-
Manipur : మయన్మార్ సరిహద్దులో కొత్తగా 70కి.మీ మేర కంచె నిర్మాణానికి ప్రణాళిక : మణిపుర్ సీఎం
-
RBI: యథాతథంగానే వడ్డీరేట్లు.. నిపుణుల అంచనా..
-
Congress: సీట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి: మధుయాష్కీ